ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యూహం ఇప్పుడు క‌ష్ట‌కాలంలో రాష్ట్రానికి అక్క‌ర వ‌చ్చిందా? ప‌్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఇప్పుడు ప్ర‌త్యేకంగా ఎవ‌రినీ నియ‌మించుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ప‌నిచేసిందా? అంటే ఔన‌నే అం టున్నారు రాజ‌కీయ నిపుణులు. అధికారంలోకి వ‌స్తూనే.. జ‌గ‌న్ చేసిన ప్ర‌ణాళిక ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి వెన్నుద‌న్నుగా నిలిచింది. ఆ సైన్య‌మే గ్రామ‌, వార్డు వలంటీర్ వ్య‌వ‌స్థ‌. ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు అన్నీ కూడా ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించే అవ‌కాశం ఏర్ప‌డింది. కానీ,వ‌లంటీర్ వ్య‌వ‌స్థ మాత్రం ప్ర‌జ‌ల‌తోనే ఉంది. ప్ర‌జ‌ల కు స‌మ‌యానికి అనుకూలంగా సేవ చేస్తోంది.



దీనిని బ‌ట్టి జ‌గ‌న్ వ్యూహం రాష్ట్రానికి ఎలాంటి మేలు చేస్తోందో చూడాలంటూ.. రాజ‌కీయ నిపుణులు చెబుతు న్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్షాల‌పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వేస్ట‌ని, ప్ర‌జాధ‌నాన్ని వృధా చేయ‌డ‌మేన‌నిటీడీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. అంతేకాదు, త‌న పార్టీ వారికే వ‌లంటీర్ ఉద్యోగా లు ఇచ్చార‌ని కూడా చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ ప‌డుతోంది. నేడు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న క‌రోనా ఎఫెక్ట్ నుంచి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేందుకు వారికి నిత్య‌వాస‌రాల‌ను ఇంటికే అందించేందుకు, మందులు, స‌ల‌హాలు,,  సూచ‌న‌లు కూడా ఇచ్చేందుకు వ‌లంటీర్లు న‌డుం బిగించారు.



దాదాపు మూడు ల‌క్ష‌ల మందిపైచిలుకు ఉన్న వ‌లంటీర్లు ఇప్పుడు ప్ర‌తి ఇంటికీ తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ఎప్ప‌టిక‌ప్పుడు న‌మోదు చేస్తున్నారు. ఏ చిన్న తేడా ఉన్నా.. ప్ర‌భుత్వా నికి నిముషాల వ్య‌వ‌ధిలో అందిస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లకు చైత‌న్యం క‌లిగించేలా క‌రోనాపై భ‌య‌ప‌డాల్సింది ఏమీలేద‌ని కూడా చెబుతున్నారు. మందులు , శానిటైజ‌ర్ల‌ను అందిస్తున్నారు. గ్రామా లు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కూడా చాలా యాక్టివ్‌గా ప‌నిచేస్తున్నారు.



దీంతో క‌రోనా క‌ట్టడి విష‌యంలో రాష్ట్రం ఈ దేశంలోనే ముందుంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్నారు. ఇదే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ లేక పోయి ఉంటే.. ప్ర‌జ‌ల ఆరోగ్యం ఏంకాన‌నే ప్ర‌శ్న కూడా వ్య‌క్త‌మవుతోంది. మొత్తానికి ప్ర‌తిప‌క్షాలు ఎన్ని వంక‌లు పెట్టినా.. జ‌గ‌న్ వ్యూహానికి ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: