ప్రపంచాన్ని కకావిలం చేస్తున్న కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యాతయుతంగా ప్రవర్తించాలని.. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు 3 వారాలపాటు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా చనిపోతున్నారు. సీసీఎంబీ అత్యవసర పరిస్తితి రోజుకు 1000 మందిని పరీక్షించే అవకాశం ఉంది.  రేపటి జనతా కర్ఫ్యూని అందరూ విధిగా పాటించాలని పిలుపు నిచ్చారు. ఇదొక క్లిష్టమైన సమయమని... అందరూ కలసి కట్టుగా దీన్ని ఎదుర్కోవాలని అన్నారు. రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. 

 

వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు ఎవరికీ వారు బంద్‌ చేసుకోవాలి. బయటికి పోవాల్సి వచ్చిన ఒక మీటర్‌ దూరంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పాటించాలి.  ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరం ముందుకు రావాలని చెప్పారు. తెలంగాణను కరోనా ఏమీ చేయలేపోయిందనే గొప్ప పేరును తెచ్చుకుందామని అన్నారు.  వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వైద్యుల ఆరోగ్యం చాలా ముఖ్యం. వైద్యులకు ఇన్‌ఫెక్షన్‌ వస్తే రాష్ర్టానికి ఇబ్బంది.

ప్రధానమంత్రినే అవహేళన చేసినట్టు మాట్లాడారు. రెండు చేతులు కొట్టి చప్పట్లు కొట్టమని చెప్పారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటల వరకు బంద్‌ పాటిద్దాం. రాష్ట్ర సరిహద్దులో 52 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. మీకు వ్యాధి లక్షణాలు ఉంటేనే ఐసొలేషన్ కు తరలిస్తారని చెప్పారు. అసలు విదేశాల నుంచి వచ్చిన వారితోనే ఈ సమస్యలన్నీ వచ్చిపడ్డాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: