ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా  వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా  వైరస్ ప్రతి రోజు పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 20 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో  రోజురోజుకు ప్రాణభయం పెరిగిపోతుంది. అయితే ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతుండడంతో.... కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. అయితే రాష్ట్రంలో కరోనా  వ్యాప్తి నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇప్పటికే కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారత దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ  విధిస్తూ భారత ప్రజలందరికీ మోడీ పిలుపునిచ్చారని  అని తెలంగాణ ప్రజలు కూడా ఇది  పాటించాలి అని తెలిపారు. 

 


  కరోనా  వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా  వ్యక్తిపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపిన కేసీఆర్... తెలంగాణ లో నమోదైన కరోనా  కేసులలో  విదేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారని వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని... రాష్ట్రంలో కరోనాకు చెక్ పెట్టేందుకు విదేశాల నుంచి ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించకుండా 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 

 


 అయితే రాష్ట్ర ప్రజలందరికీ క్షేమం దృష్ట్యా కఠిన చర్యలు తప్పడం లేదు అంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యు ను  అందరూ పాటించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేవలం 14 గంటలు మాత్రమే కాదు.. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు కర్ఫ్యూ  పాటించి సామాజిక  బాధ్యతను చాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. షాపింగ్ మాల్స్ మెట్రో, బస్సులు, మార్కెట్లు అన్ని రేపు మూసి వేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఆస్పత్రిలు,  మెడికల్ షాపులు ఇతర అత్యవసర సేవలన్ని  రేపు అందుబాటులో ఉంటాయని కేసీఆర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: