ప్రపంచంలో కరోనా వైరస్ విజృంభన ఎక్కువైంది.  చైనాలో ఈ ప్రభావం కాస్త తగ్గుతున్నా.. ఇతర దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతుంది. చైనాలో 3 వేలకు పైగా మరణాలు సంబవిస్తే.. ఇటలీలో అంతకు మించి మరణాలు సంబవించాయి. ఇరాన్​కు ఇప్పుడు కొత్త సంవత్సరం. పర్షియన్​ న్యూ ఇయర్​ నౌరుజ్​ను సెలబ్రేట్​ చేసుకోవాల్సిన టైం. కానీ, ఆ ఇప్పుడు అక్కడ మిగిలింది కన్నీరే.. అవును, ఇటలీ తర్వాత కేసులు, మరణాల్లో ఇరానే టాప్​లో ఉంది. చావులు ఎక్కువవుతున్నాయి.  ఇరాన్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతున్నది. ఇరాన్‌ ప్రభుత్వం దేశంలో ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట పడటంలేదు.

 

గత 24 గంటల్లోనే ఇరాన్‌లో 123 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 15,556కు చేరింది.  ఈ 14 రోజుల్లో ఆయన కళ్లముందే పదుల సంఖ్యలో పేషెంట్లు, వాళ్లకు ట్రీట్​మెంట్​ చేస్తున్న తోటి డాక్టర్ల చావులను చూశారు.   గత 24 గంటల వ్యవధిలో 966 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందంటే అక్కడ వైరస్‌ ఎంత బీభత్సం సృష్టిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో కలిపి ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 20,610కి చేరింది. 

 

ఇరాన్​లోని 31 ప్రావిన్స్​లలో వైరస్​ సోకింది. తమ దేశాలకు వైరస్​ రావడానికి కారణం ఇరానేనని ఇరాక్​, కువైట్​, ఒమన్​, లెబనాన్​, యూఏఈ, కెనడా, జార్జియా, న్యూజిలాండ్​లు ఆరోపిస్తున్నాయి. వైరస్​ ప్రారంభమైన తొలి నాళ్లలో పెద్ద ప్రమాదమేమీ లేదని ఇరాన్​ ప్రీమియర్​ అయతొల్లా అలీ ఖమీనీ ప్రకటించారు.  ఇదిలా ఉంటే.. ఇరాన్ లో నివసిస్తున్న 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది.  వీరికోసం ఓ హెల్ప్ లైన్ ను తీసుకొచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.  ఇరాన్ నుంచి ఇటీవలే కొంతమంది ఇండియాకు తీసుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: