ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏనాడైతే కరోనా వైరస్ గురించి పారాసెట్మాల్ టాబ్లెట్ మరియు బ్లీచింగ్ పౌడర్ గురించి చేసిన కామెంట్లు అనటం జరిగిందో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు జగన్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. కరోనా వైరస్ గురించి మాట్లాడిన మీడియా సమావేశంలో స్పందిస్తూ..‘పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే సరి.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లితే సరి..’ అంటూ చిట్కా వైద్యం టైపు కామెంట్లు చేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఇవ్వండి ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంది. అటువంటి దాని గురించి జగన్ ఇలా మాట్లాడటంపై చాలామంది ఎటకారం చేశారు. సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు.

 

అయితే ఇప్పుడు అదే ముఖ్యమంత్రి స్థాయి కింద ఉన్న ఒక ఉన్నతాధికారి కరోనా వైరస్ గురించి పారాసెటమాల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ నోరు జారారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ని కూడా టార్గెట్ చేసి అరకిలో పారాసిట్ మాల్ సరిపోతుందా సార్? అంటూ ఆయనపై కూడా మండిపడ్డారు. దేశమంతటా ప్రపంచమంతటా ఈ వైరస్ గురించి భయం ఆందోళన చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికారులు మరియు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఎన్నికలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించటం చాలా సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు.

 

జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి కామెంట్లకు మరియు అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రపంచమంతటా ఒకలా వ్యవహరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు మరియు నాయకులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని చాలా దారుణంగా సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి అయి ఉండి ఉన్నతాధికారి అయ్యుండి...పారాసిటమాల్ టాబ్లెట్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: