ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన దగ్గర నుంచి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ కుట్రలు చేశారని మండిపడుతున్నారు. ఇక ఇటు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

 

అయితే ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్‌తో సహ kఒందారు వైసీపీ నేతలు అధికారులని బూతులు తిడుతున్నారంటూ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల సమావేశంలో ‘అన్నా... మీరే ముందుకు నడిపించాలి' అన్న జగన్, ఇప్పుడు మాత్రం నిజస్వరూపం చూపిస్తున్నారని, వినలేని బూతులు, వేధింపులతో అధికారులపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు.

 

ఇక జగన్ చేసే తప్పుడు పనులకు సహకరించడం లేదని ప్రభుత్వం అధికారులను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. అయితే జగన్ అధికారులని బూతులు తిడుతున్నారని అచ్చెన్నకు ఎలా తెలిసింది. అధికారుల సమావేశాలు జరిగేటప్పుడు అచ్చెన్న అక్కడేమన్నా ఉంటున్నారా? లేదా ఏ అధికారైనా వచ్చి బాబోయ్ జగన్ మమ్మలని తిట్టేస్తున్నారని అచ్చెన్నతో ఏమన్నా మొర పెట్టుకున్నారా? అంటే అలాంటివి ఏమి జరగలేదు.

 

కానీ ఏదో గుడ్డికి జగన్‌పై విమర్శలు చేయాలి కాబట్టి, అచ్చెన్న పనికిమాలిన విమర్శలు చేసేశారు. పైగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్న అధికారులతో ఎలా ప్రవర్తించేవారో చాలా వార్తలు వచ్చాయి. అలాగే మంత్రి హోదాలో ఎలా దందాలు చేశారో తెలుసు. ఆఖరికి అధికారం కోల్పోయాక కూడా మహిళా ఎంపీడీఓపై చిందులు వేశారు. కోటబొమ్మాళి మండల ఆఫీసులో ఆయన చేసిన రచ్చ తెలియనిది కాదు. అయితే అచ్చెన్న అధికారులతో దురుసుగా ఉంటారు కాబట్టి, అంతా అలాగే ఉంటారనే ఫీలింగ్‌లో ఉన్నట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: