కరోనా వైరస్ భయం ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ఉన్న కొద్ది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవటంతో దేశంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలో మరియు కేరళ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలలో ఈ వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. ఇటువంటి తరుణంలో ప్రధాని మోడీ యావత్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. మార్చి 22వ తారీఖున జనతా కర్ఫ్యూ పాటించాలని ఎవ్వరూ కూడా ప్రజలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బయటకు రాకూడదు అంటూ ఇంటికి పరిమితం కావాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా చేస్తే చాలా వరకు వైరస్ నిరోధించిన వారం అవుతామని మోడీ పేర్కొన్నారు. దీంతో చాలా వరకు అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రజలు ఆదివారం కావలసిన వస్తువులన్నింటిని సమకూర్చుకుని జాగ్రత్తలు తీసుకుని రెడీ అయ్యారు.

 

అయితే హైదరాబాద్ వాసులు మాత్రం సూపర్ మార్కెట్ మీద పడి ఏదో సంవత్సరాలుగా జనతా కర్ఫ్యూ ప్రధాని మోడీ పాటించాలని చెప్పినట్లు ఓవర్ యాక్షన్ చేస్తు నిత్యవసర సరుకులు కొనడానికి రెడీ అయిపోయారు. దీంతో అసలే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాదులో సూపర్ మార్కెట్లలో ప్రజలు తండోపతండాలుగా వెళ్లడంతో ఈ వ్యాధి వైరస్ ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

 

కేవలం ఒక్కరోజు మాత్రమే కర్ఫ్యూ ప్రధాని మోడీ విధించగా హైదరాబాద్ వాసులు ఓవరాక్షన్ చేస్తూ కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చెందే విధంగా గుంపులు గుంపులుగా సూపర్ మార్కెట్లలో తిరగటాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. మరొక్క సోషల్ మీడియాలో పోస్టులు కంగారు పెట్టే విధంగా ఉండటంతో...వీటిని ఆధారం చేసుకుని సూపర్ మార్కెట్ యజమానులు రేట్లు మీద రేట్లు పెంచేశారు. ఇలాంటి కంగారు పడే పనులు చేయటం వల్లే కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని దాదాపూ గుంపులుగుంపులుగా ఎవరు తిరగవద్దు అని తెలంగాణ ప్రభుత్వం చేతులు జోడించి మరీ చెప్పటం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: