కరోనా కలకలం ఒక వైపు బ్రతుకులను భయపెడుతుంటే.. తాజాగా కరీంనగర్‌లో మరో పిడుగులాంటి సంఘటన జరిగింది.. అసలు కరీంనగర్‌లో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితి నెలకొంది.. తాజాగా 10 మందితో కూడిన ఇండోనేషియా బృందం, ఈ నెల 14న ఢిల్లీ నుంచి రామగుండం రైల్వే స్టేషన్‌కు వచ్చి, అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ వెళ్లి కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో బస చేసింది.. వీరు రామగుండం నుండి కరీంనగర్ వరకు ఎందుకు ఆటోలో వెళ్ళారు.. ఒక వేళ మతప్రచారం కోసం వస్తే వీరు మతోన్మాదులా, లేక మరేదైన విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారా అనే ప్రశ్నలు కరీంగనర్‌ ఉమ్మడి జిల్లా పోలీసులను వేధిస్తున్నాయట..

 

 

ఇక ప్రార్థనా మందిరాలలో ఉన్న స్థానికులను విచారించినప్పుడు ‘ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి... అక్కడి మత పెద్దల సూచనల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి మత ప్రచారం సాగిస్తారని’ చెబుతున్నారు. అయితే ఇండోనేషియా సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రార్థనా మందిరంలో రెండు మూడు రోజులు గడుపవలసిన అవసరం ఏముంది.. ఇలాగే వీరు కరీంనగర్‌కు రావడానికి ముందు మరో బృందం కరీంనగర్‌ రూరల్‌ ఏరియాలోని రేకుర్తి, సాలెహ్‌నగర్, గుంటూరుపల్లిలో తిరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం వీరు ఎక్కడికెళ్లారనే విషయంలో స్పష్టత లేదు..

 

 

అయితే గత నెల 17న జగిత్యాలలో ఓ నిషేధిత సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండోనేషియాకే చెందిన బృందం హాజరై జెండాను ఎగరవేసిందని సమాచారమట. వీరిలో నాలుగు జంటలు కూడా ఉన్నాయట.. కాగా వీరంతా రామగుండం, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలను కూడా సందర్శించి 18న తిరిగి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు.. కాగా ‘ఇండోనేషియా నుంచి వచ్చే మత ప్రచారకులు ఢిల్లీ చేరుకొని అక్కడ మత పెద్దలను కలువగా, వారు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతారు. ఇందుకు గాను రైళ్లు, వ్యాన్‌లు, ఆటోలనే ఉపయోగించడం, అందులో కరోనా నేపధ్యంలో ఇలా జరగడం అనుమానాలకు తావిస్తున్నాయి..

 

 

ఇదే కాకుండా కరోనా లక్షణాలతో ఉన్న వారు కూడా ఇక్కడ పర్యటించడం వెనక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తూ చేస్తున్నారట.. కాని ఎవరి ఊహకు అందనంత ఆలోచనలతో వీరు ఏదో చేస్తున్నారనే అనుమానాలు అధికారుల్లో నెలకొన్నాయట.. మరి నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయని ఆశిద్దాం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: