ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి జడలు విప్పుతోంది. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ కు భారత్ అంత వణుకుతుంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా రెండు లక్షలకు పైగా ఈ కరోనా బారిన పడ్డారు... ప్రపంచవ్యాప్తంగా 10వేలమందికిపైగా ఈ కరోనా వైరస్ బారిన పడి మృతిచెందారు. ఇంకా అలాంటి ఈ సమయంలో కరోనా వైరస్ కు.. నక్షత్రాలకు లింక్ పెడుతూ వాట్సాప్ లో వైరల్ అవుతుంది. 

 

అసలు ఇప్పటికే ఈ కరోనా వైరస్ కు బయపడి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే మళ్లీ సోషల్ మీడియాలో ఓ ప్రచారం ఒకటి.. ఇప్పుడు నక్షత్రలకు కరోనాకు లింక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు.. అసలు అది ఏంటి అంటే? ప్రతి 29.5 సంవత్సరాలకు, శనిగ్రహం (సాటర్న్) ఉత్తరాషాద నక్షత్రం (అఫెలియన్) లోకి వస్తుంది అని.. అలా వచ్చినప్పుడు ఒక రకమైన వైరస్ శనిగ్రహం (సాటర్న్) నుండి భూమికి వస్తుంది అని.. ఆ వైరస్ ఏ మనుషుల ప్రాణాలు తీస్తుంది అని అంటున్నారు. 

 

అంతేకాదు.. కరోనా వైరస్ 25/12/2019 న శనిగ్రహం నుండి ప్రయాణించి 10/01/2020 న భూమికి చేరుకుంది అని.. ఈ వైరస్ 25 ° అక్షాంశం నుండి 35 ° అక్షాంశం వరకు పతనం మధ్య అధిక తీవ్రతను కలిగి ఉంది మరియు ఇతర ప్రదేశాలపై చిన్న ప్రభావాన్ని చూపుతుంది భూగోళం.. శాస్త్రీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వైరస్ 25/05/2020 వరకు ప్రభావం చూపుతుంది అని తరువాత అది నెమ్మదిగా తగ్గి 20/07/2020 కి ముందు అదృశ్యమవుతుంది అని ప్రచారం సాగుతుంది.

 

అంతేకాదు.. భారతదేశం అంతటా నవపాషణం శివలింగాలు ఉన్నందున ఈ వైరస్ నుండి తప్పించుకోవడానికి భారత భూమి అత్యధిక సురక్షితమైన ప్రదేశం. ములా, పూర్వాషాడ, ఉతరాషాడ, మృగశిర, అరుద్ర మరియు పునర్వసు నక్షత్రాలు ఉన్నవారు ఈ వైరస్ నుండి జాగ్రత్తగా ఉండాలి అని ఆ ప్రచారంలో జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: