దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కు చేరింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటికే నలుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో ప్రధాని మోదీ రేపు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. 14 గంటల పాటు ప్రజలు ఇంటికే పరిమితమైతే దేశంలో వైరస్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది. ఇంటికే పరిమితమైతే ఇంట్లో కరోనా పేషంట్ లేనంతవరకు, మీ ఇంట్లో ఏ వస్తువును తాకినా ఎలాంటి రిస్క్ ఉండదు. 
 
కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు ఇంటికే పరిమితమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక వైరస్ సాధారణ జీవిత కాలం 12 గంటలు మాత్రమే కాబట్టి 14 గంటలు ఇంటికే పరిమితమైతే కరోనా ప్రభావిత ప్రాంతాలు వైరస్ లేని ప్రాంతాలుగా మారే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వార్తలో పూర్తిగా నిజం లేకపోయినా కొంతవరకు మాత్రం నిజం ఉంది. ఇంటికే పరిమితమైతే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే కరోనా అనుమానిత కేసులు అంటూ వైరల్ అవుతున్న వార్తలు భయభ్రాంతులకు గురి చేస్తాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా... ఒక వేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకొని మిగతా సమయం అంతా ఇంటికే పరిమితమైతే కరోనా శత్రువుపై విజయం సాధించడం పెద్ద కష్టం కాదు. ప్రజలందరరూ సమిష్టిగా కొంతకాలం పాటు ఎక్కువ సమయం ఇంటికే పరిమితమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే అతి త్వరలో దేశంలో కరోనా కనుమరుగవడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: