ఐక్యరాజ్యసమితి ఉరిశిక్షలు ఆపేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో తెలీదు.. కానీ చేసింది. అంతేకాదు.. దోషులకు ఉరిశిక్షలు ఆపేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా సరే ఆ ఉరి శిక్షలను ఆపేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్‌, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరి శిక్షలపై స్పందించారు. 

 

ఉరి శిక్షలపై ఆంటోనియా గ్యుటెరెస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని దేశాలు అన్ని కూడా మరణశిక్షను ఆపేయాలని.. లేదా కనీసం ఉరి శిక్షలపై తాత్కాలికంగా అయినా నిషేధాన్ని విధించాలి అని ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకుందని మీడియా సమావేశంలో తెలిపారు. అయితే నిర్భయ ఘటన జరిగి 8 ఏళ్ళ తర్వాత ఎన్నో వాయిదాల తర్వాత నిర్భయ దోషులపై నిన్న ఉదయం ఉరి శిక్ష పడింది. 

 

సరిగ్గా 24 గంటలకే ఐక్యరాజ్య సమితి ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది.. నిర్భయను గ్యాంగ్ రేప్ చేసిన 6 మందిలో నలుగురికి నిన్న ఉరి శిక్ష పడగా.. ఒకరు మైనర్ కావడం వల్ల శిక్ష నుండి తప్పించుకున్నాడు. మరొకడు ఘటన జరిగిన ఆరు నెలలకే ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. 

 

అయితే.. ఇక్కడ గమనించాల్సినా విషయం ఏంటి అంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యాచారాలు రోజులో కొన్ని వందలు జరుగుతున్నాయి. కానీ అత్యాచారాలు జరిగి మృతి చెందిన బాధితులకు న్యాయం జరగాలి అంటే ఏళ్ళు పడుతుంది. వారి ప్రాణాలు క్షణాల్లో పోతాయి.. కానీ ఆ ప్రాణాలు తీసిన నీచులలో నాలుగురుకు ఉరి శిక్ష పడితే మాత్రం ఏకంగా ఐక్యరాజ్య సమతినే స్పందించింది. అసలు ఐక్యరాజ్య సమితినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా నీచుల ప్రాణాలకు ఉన్న విలువ అమ్మాయిలకు లేదు అనేది ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది.  

 

కాగా కరోనా వైరస్ ను వీలైనంత తొందరగా అంతం చెయ్యాలి అని.. లేదంటే వేళల్లో ప్రాణాలు కోల్పోతారు అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరాస్‌ హెచ్చరించారు. అంతే కాదు కరోనా వైరస్ కార్చిచ్చుతో సమానం అని.. కార్చిచ్చులా ఈ కరోనా మహమ్మారి వ్యాపిస్తుంది అని గత 75 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదని అయన వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: