కరోనా ఆ పేరు చెప్పడానికే జడుసుకునే పరిస్థితి. కరోనా అన్న మూడక్షరాలు  జీవితం అనే మూడక్షరాలను ముగించేస్తున్న క్రమంలో  ఆ భయంకర ఉత్పాదాన్ని తలచుకుని కలవరపడుతున్నారు. విశ్వమంతా వీర విహారం చేస్తూ కరోనా 800 కోట్ల మంది మనుషుల మీద తన ప్రతాపం చూపిస్తోంది. కరోనా వైరస్ పుట్టుక చైనాలోని ఊహాన్. కానీ అది శరవేగంగా విస్తరిస్తూ ఇప్పటికి 187 దేశాలకు ఎగబాకింది.

 

అటువంటి కరోనాను అదుపు చేయడం ఏ ఒక్క అగ్ర రాజ్యానికి సాధ్యం కావడం లేదు. కరోనాకు లేదు నివారణ. ఒక్క నియంత్రణ మాత్రమే సాధ్యమని అంతా చెబుతున్నారు. ఆ నియంత్రణ కోసం ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని అమలుచేశారు. ఇక చైనాలోని అతి ముఖ్యనగరం ఊహాన్ లో కరోనా మరణ  మ్రుదంగం మోగించినపుడు అక్కడ మొత్తం కార్యకలాపాలు ఆపేశారు. లాక్ డౌన్ ప్రకటించారు. 

 

ఆ తరువాత మిగిలిన దేశాలో కూడా మహా నగరాలల్లో లాక్ డౌన్ చేశారు. స్పెయిన్ లాంటి దేశాల్లో మాత్రం మొత్తం కర్వ్యూని విధించారు. అయితే ఇపుడు కరోనా భారత్ లో ప్రవేశించింది. రెండవ దశలో ఉంది. మూడవ దశకు చేరుకుంటే తీవ్రం, నాలుగవ దశకు వచ్చిందంటే ఇటలీ కంటే దారుణాలు జరిగిపోతాయి. లక్షల్లో మరణాలు ఉంటాయని ఐక్య రాజ్యసమితి హెచ్చరిస్తోంది.

 

ఈ నేపధ్యంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు 22న ఆదివారం జనతా కర్ఫ్యూ ని 130 కోట్ల మంది భారతీయులంతా పాటించబోతున్నారు. ఇది నిజంగా ఓ అద్భుతం. వరల్డ్ రికార్డు గా చెప్పాలి. కరోనాని ఆపే క్రమంలో చాలా దేశాలు అక్కడి  నగరాలకే ఈ కర్ఫ్యూని పరిమితం చేస్తే భారత్ లో ఆసేతు హిమాచలం దీన్ని అమలు చేస్తోంది. 

 

ఓ అద్భుతంగా దీన్ని చూడాలని అంటున్నారు. ఓ విధంగా జనతా కర్ఫ్యూ వల్ల కరోనా గొలుసుకట్టు వ్యాప్తి ఆగిపోతుంది. అదే విధంగా ప్రపంచానికి భారత్ ఓ మంచి సందేశం కూడా పంపుతుంది. కరోనా సైతం షాక్ తినేలా ఈ ఐక్యత రేపు భారత ప్రజలు  చాటబోతున్నారు. రానున్న రోజుల్లో కరోనాని పూర్తిగా దేశం నుంచి పారదోలేందుకు ఇది మొదటి మెట్టుగా కూడా భావించాలి. మొత్తానికి భారతీయుల శక్తిని చాటే గొప్ప సన్నివేశం విశ్వమంతా కళ్ళారా 22న చూస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: