ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్...ఏపీలో కూడా అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా మాల్స్, సినిమా హళ్ళు, స్కూల్స్ మూసివేశారు. ప్రజలకు శానిటైజర్స్, మాస్కులు అందిస్తున్నారు.

 

అయితే ప్రభుత్వ ఓ వైపు ఇలా కష్టపడుతుంటే, మరోవైపు టీడీపీ నేతలు దీనిపై రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో రాజకీయాలు వదిలేసి సపోర్ట్‌గా ఉండాల్సింది పోయి, లాజిక్ లేని విమర్శలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోజూ ప్రెస్ మీట్ పెట్టి, జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఆయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.

 

తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య అసలు లాజిక్ లేకుండా మాట్లాడేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా, అబ్బే అదేం లేదు ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో జగన్ విఫలమయ్యారంటూ మాట్లాడారు. అసలు కరోనా అంటే ఏమన్నా బస్ అనుకుంటున్నారో, లారీ అనుకుంటున్నారో మరి తెలియదు గానీ, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. కరోనాను అడ్డుకోలేకపోయారని పనికిమాలిన విమర్శ ఒకటి చేశారు. పైగా జగన్ ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు చేస్తున్న, మీడియా ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

 

తమ అధినేత చంద్రబాబు మాదిరిగా మీడియా ముందుకొచ్చి, సోది మాటలు చెప్పాలని వర్ల రామయ్య కోరుకుంటున్నట్లు కనబడుతోంది. అసలు అలాంటి పనులు జగన్‌కు అలవాటు ఉండవన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే  కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఎలాగో ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ, ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇక ఇన్ని చేస్తున్న టీడీపీ నేతలు మాత్రం ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: