బ్లేడ్ బ్యాచ్... తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు గురించి మరొకసారి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం వారు చేసే కిరాతక పనులు. వీరు మరోసారి విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఈ బ్యాచ్ స్థానికులు, పాదచారులపై దాడులు చేసింది. వారు విజయవాడలో డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తూ ఒక ప్రాంతంలో హల్‌ చల్ చేశారు. వారు  బలవంతపు వసూళ్లకు పాల్పడడంతో చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వని వారిపై దౌర్జన్యానికి దిగారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు.

 

IHG

 

అక్కడి వారు డబ్బులు ఇవ్వలేదని ముఖంపై సిగరెట్ తో కాల్చి వారిని చిత్రహింసలకు గురిచేసినట్లు వారికి బలైన బాధితులు చెబుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు సిగరెట్లతో ముకంపై కాల్చడంతో అందులోని ఇద్దరికి కాస్త తీవ్రగాయాలైనట్లు సమాచారం. విజయవాడలోని గవర్నర్ పేట ప్రాంతంలో ఆటోల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు వారు గురిచేశారు. అక్కడ తిరుగుతున్న వారిపై డబ్బులు ఇవ్వాలంటూ పలువురిపై దౌర్జన్యం చేసినట్లు వారు తెలుపుతున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధితులు ఆందోళన చెందడం వారి వంతు అయ్యింది.

 

IHG


 గవర్నర్ పేట ప్రజలు.. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు దాడులు చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదంటూ బాధితులు వారు ఆరోపిస్తున్నారు. వారు ఏకంగా గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌ కి ముట్టడించి అక్కడ ఆందోళన చేపట్టారు. దింతో బాధితుల ఆందోళనతో నిద్రలేచిన పోలీసులు గంజాయి మత్తులో ప్రజలపై దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ సభ్యుడిని అదుపులోకి తీసుకుని ఆ సభ్యుడిని వారి స్టైల్ లో విచారిస్తున్నారని సమాచారం అందుతోంది.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: