దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా 250కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఇలాంటి సమయంలోనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న నిబంధనలను పాటించాలి అంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా మార్చి 22వ తేదీన ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ జనతా కర్ఫ్యూ  నిర్వహించాలని.. దేశ ప్రజలందరికీ పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 

 


 అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే.. దేశానికి కష్టం వచ్చినప్పుడు ముందుండి నడిపించే నాయకుడు ఎంత అవసరమో.. విపత్తు  తీవ్రమైనప్పుడు ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు నడిపించే నాయకుడు అంతే అవసరం.. అలాంటిదే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో భారత ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి... భారత్ లోని సమస్యను తీర్చేందుకు భారత ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగి నటువంటి సమయంలో .. 1965లో తిండి గింజల కొరత రాబోతుంది అంటూ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 

 

దేశ ప్రజలందరూ ఒక పూట తిండి మానేస్తే ఆ వార తిండి గింజలు  మిగులుతాయి అంటూ  లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపు. అయితే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపుకు దేశంలోని ప్రజలందరూ పాటించారు స్వచ్ఛందంగా హోటళ్లను సైతం మూసివేశారు. భారత ప్రజలందరూ ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. ఏకంగా అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైతం ఉపవాసం ఉన్నారు. ఇక తర్వాత ఇన్నేళ్ళకి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరూ ఒకరోజు నాకు ఇవ్వండి మీకు వచ్చిన సమస్యను పారద్రోలుత  అంటూ హామీ ఇచ్చారు. అందుకే జనతా కర్ఫ్యూ ని  పాటిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: