ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్  శరవేగంగా వ్యాప్తిచెండుతున్నా  విషయం తెలిసిందే . మొన్నటి వరకు చైనా దేశంలో మరణ మృదంగం మోగించిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం... ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది . ఇక ఈ వైరస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో మరింత భయం ఆందోళన నెలకొంటోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు  కఠిన నిబంధనలు పాటిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి చేయి దాటి పోతుంది. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడంతో పాటు.... కరోనా  వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య  కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఐరోపా ఖండంలో అయితే విలయతాండవం చేస్తుంది కరోనా వైరస్. 

 


 చైనా దేశంలో కంటే ఇక్కడ ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ముఖ్యంగా ఇటలీ స్పెయిన్ లాంటి దేశాలు ఎక్కువగా కరోనా  ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడంతో పాటు... కరోనా  వైరస్ కారణంగా మృతుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటలీ స్పెయిన్ లాంటి దేశాలు తమ సరిహద్దులను మూసివేసాయి. ఇక కరోనా  వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా వున్న ఇటలీ దేశం అయితే పూర్తిగా లాక్ డౌన్  లోకి వెళ్ళిపోయింది. దేశంలో ఉన్న ప్రజలు ఎవరూ ఇంటిని దాటి బయటకు రావద్దు అంటూ ఆదేశాలు సైతం జారీ చేసింది. 

 


 మరోవైపు స్పెయిన్ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా స్పెయిన్ లో ఉండే  ఓ జంట  పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆల్ఫా డయాజ్ , డేనియల్ కామినో  జంట కరోనా  వైరస్ ఎఫెక్ట్ వల్ల తప్పనిసరిగా తమ వివాహాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కానీ వారు మాత్రం ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని అనుకున్నారు . ఈ క్రమంలోనే వారికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే పక్కింటి వ్యక్తి కి ఫోన్ చేసి తమ పెళ్లి జరిపించాలని కోరారు. తమ ఇంటి కిటికీలోంచి బయటకు వంగి  పెళ్లి ప్రమాణాలు చేశారు.. ఇక చుట్టు పక్కల ఇళ్లల్లో ఉన్నవారు కూడా కిటికీ లోంచి ఈ జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో స్పెయిన్లో ప్రజలు కరోనా ప్రభావం  ఎంత ఉన్నది  అర్థం అయిపోయింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Pues al final sí que hubo boda! Gracias vecinos y amigos!

A post shared by Frida Kiwi (@frida_kiwi) on

మరింత సమాచారం తెలుసుకోండి: