ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్ధం కాక కొందరు అమాయకంగా ముఖం పెడితే.. మరికొందరు ఏం జరగబోతుందో అర్దం చేసుకుని భయంతో బ్రతుకుతున్నారు.. ఇప్పుడు లోకం అంతటా ఒకటే ప్రశ్న యుగాంతం వచ్చిందా.. యుగాంతం లక్షణాలను ఇలాగే ఉంటాయి. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.. ఇకపోతే ఇది యుగాంతం కాదు.. కాని కొందరు అబద్దాలను ప్రచారం చేస్తున్నారు.. ఇక కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రతి దేశంలో కఠినమైన ఆంక్షలు అమలు జరుగుతున్నాయి.. ఇందులో భాగంగా పూర్తిగా ఎవరికి ఎవరు కూడా రాసుకుపూసుకుని తిరగవద్దు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి లాంటి జాగ్రత్తలు చెబుతున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో ఇంట్లోనుండి బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం.. కానీ కొందరు ఇలాంటి మాటలను పట్టించుకోకుండా కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారు..

 

 

ఇలాంటి వారిలో కొందరు దరిద్రులు చావుకు భయపడకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.. ఇకపోతే యూరప్ దేశాల్లో పార్టీలు, సమావేశాలపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఇటలీలో ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరూ గుంపులు గుంపులుగా ఉండవద్దని, కొద్ది రోజులు ఇళ్లలోనే ఉండాలని ప్రకటించారు. అయితే, ప్రజలు మాత్రం ఇవేవీ పాటించడం లేదు. ‘గార్డియన్’ వారా సంస్థ కథనం ప్రకారం.. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పరిస్థితి చేయి దాటుతోందని పేర్కొంది. ప్రభుత్వ ఆంక్షలు లెక్క చేయకుండా ప్రజలు క్లబ్బులు, పబ్బులు, బారుల్లో గుమిగూడి పార్టీలు చేసుకున్నారు.

 

 

ఇక యూకే ప్రజలు కూడా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతు మరి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ‘‘యుగాంతం వచ్చేసింది, ఎంజాయ్ చేసి చచ్చిపోదాం’’ అంటూ రోడ్ల మీదకు వస్తుండటంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. అదీగాక మార్చి 17న సెయింట్ ప్యాట్రిక్స్ డే పురస్కరించుకుని లండన్, లివర్‌పూల్, మాంచెస్టర్, న్యూకాస్ట్లే నగరాల్లో యువతీ యువకులంతా ఒకే చోట చేరి పార్టీలు జరుపుకున్నారు. కరోనా మీద పాటలు పాడారు. అంతే కాకుండా ఫ్లొరిడాకు చెందిన ‘స్ప్రింగ్ బ్రేకర్స్’ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ ఉన్నా సరే మేం పార్టీలు కొనసాగిస్తాం’’ అని ప్రకటించారు వెర్రి వెంగళప్పలు.. ఇక కరోనా విషయంలో వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని,ఈ వైరస్ సోకితే బతికే అవకాశాలు తక్కువనే ప్రచారం జరుగుతోంది.

 

 

కాగా కరోనా వైరస్ యువత, వృద్ధులని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సోకుతుంది. పొరబాటున ఇది సోకిందంటే కనీసం 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉండాలి.. లేదంటే ప్రాణాలకు ప్రమాదంగా మారుతుంది. ఇలా చెప్పిన మాట వినకుండా పబ్లిక్‌లోకి వెళ్లి అందరితో కలిసి పార్టీలు చేసుకోవడం కారణంగా ఒకరి నుంచి వందలాది మందికి వైరస్ సోకుతుంది. ఆ వందలు, వేలకు.. లక్షలకు దారి తీయవచ్చూ.. కాబట్టి మనందరం సాధ్యమైనంత వరకు ఇంటిలోనే ఉండటం బెటర్.. దీని వల్ల ఈ వ్యాధిని జయించవచ్చూ అనే దానికి చైనాయే నిదర్శనం.. కాబట్టి ప్రతి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే మనం దేశానికి చేసే సేవ..

మరింత సమాచారం తెలుసుకోండి: