క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ వైసీపీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయం లో ప‌డ్డాయి. అనూహ్య ప‌రిణామాల‌తో ముందుకు సాగుతున్నాయి. గ‌త ఏడాది ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆర్ధ‌ర్ విజ‌యం సాధించారు. అయితే, ఆయ‌న‌కు రాజ‌కీయాలు పెద్ద‌గా క‌లిసి వ‌చ్చిన‌ట్టు క‌నిపిం చ‌డం లేదు. ఆయ‌న ఎన్నికైనా కూడా పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టు సంపాయించు కోలేక పోయారు. దీంతో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఇక్క‌డ ఓడిపోయిన టీడీపీ అభ్య‌ర్థి పైచేయి సా ధించేందుకు ప్ర‌య‌త్నించారు.



ఆదిలో ఈయ‌న‌ను నిలువ‌రించేందుకు, టీడీపీకి చెక్ పెట్టేందుకు ఆర్ధ‌ర్ పెద్ద‌గా ప్ర‌య‌త్నించ‌లేక‌పోయారు. నిదాన‌స్తుడు, వివాద ర‌హితుడు కావ‌డం ఆర్ధ‌ర్‌కు మైన‌స్‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఈ నేప థ్యంలోనే అనూహ్యంగా యువ నాయ‌కుడు గ‌ట్టి వాయిస్ వినిపించే నేత‌, అదికూడా సీఎం, వైసీపీ సుప్రీం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్క‌సారిగా ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితి మారిపోయింది. అంతా వైసీపీ జ‌ప‌మే క‌నిపిస్తోంది.



అయితే, అదే స‌మ‌యంలో పార్టీపైనా, నియో జ‌క‌వ‌ర్గంపైనా కూడా బైరెడ్డి వ్యూహాత్మ‌కంగా ప‌ట్టు సాధించారు. అంతేకాదు, ఇన్నేళ్ల‌లో ఆర్ధ‌ర్ సాధించ ని విధంగా పార్టీలోని సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోవ‌డం, వారికి త‌ల‌లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, టీడీపీకి ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెట్ట‌డం వంటి అంశాల్లో బైరెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫ‌లితంగా పార్టీ కోరుకున్న నాయ‌కుడు ల‌భించ‌డంతో బైరెడ్డికే ఇక్క‌డ పూర్తి ప‌గ్గాలు అప్ప‌గించిన‌ట్టు అ యింది. టెక్నిక‌ల్‌గా ఆర్ధ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌నులు చేయాల‌న్నా ఏ నిర్ణ‌యం తీ సుకోవాల‌న్నా కూడా నాయ‌కులు, ప్ర‌జ‌లు కూడా ఇప్పుడు బైరెడ్డి ఇంటికే క్యూక‌డుతున్నారు.



దీంతో ఆర్ధ‌ర్ వ‌ర్గం క‌కావిక‌లం అయ్యే ప‌రిస్థితి నెల‌కొంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనంత‌టికీ ఆర్ధ‌ర్ మెత క్కా ఉండ‌డం, విప‌క్షంపై పైచేయి సాధించ‌లేక పోవ‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో పూర్తిగా విఫ‌లం కావ‌డం వంటి ప‌రిణామాలు ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఫ్యూచ‌ర్ లేకుండా చేశాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా త‌న త‌ప్పులు తెలుసుకుని, అంద‌రితోనూ క‌లిసి మెలిసి ఉండేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: