ఇప్పుడు ప్రపంచాని కంతటికి కరోనా అంటే కఠోర విషంగా తోస్తుంది.. ఈ విషానికి విరుగుడు ఎవరు తయారు చేసారా అని ఆశతో అమృతం కోసం దేవతలు ఎదురు చూసినట్లుగా చూస్తున్నారు ప్రజలు.. ఇలాంటి సమయంలోనే ముక్కోపి అయిన ట్రంప్ ఒక తియ్యని వార్త గాల్లో వదిలాడు.. ప్రపంచ దేశాలకు పెద్దన్న అయినా అమెరికా అద్యక్షుడు ట్రంప్ చెప్పే తియ్యటి మాట ఏంటంటే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందట..

 

 

ఇప్పటికే కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయితో కొత్త రూపొందిస్తున్న ఈ కొత్త వ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని, ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి హైడ్రాక్సీక్లోరోక్వినైన్ సరైన మొగుడని కాబట్టి ఇది ప్రభావవంతంగా ఆ వైరస్ పై పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారని ట్రంప్ గుర్తుచేశారు. ఒకవేళ ఇదే జరిగితే వైద్య చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని, గొప్ప మలుపు సాధ్యమవుతుందని ట్వీట్ చేశారు.

 

 

ఇకపోతే పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసం తనకు ఉంది. అందుకే ఈ ప్రయోగాన్ని వేగంగా చేయండి. జనం చచ్చిపోతున్నారు, అంటూ గాడ్ బ్లెస్ ఎవ్రీవన్’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన ట్వీట్‌కు అనూహ్య స్పందన వస్తోంది.కాగా నెటిజన్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా అమెరికా అమెరికానే అనిపొగుడుతున్నారు.. ఇక కోవిడ్ 19 పై ఉన్నతాధికారులతో డొనాల్డ్ ట్రంప్ శనివారం అంటే మార్చి 21 న అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఈ విషయంలో తీవ్రంగా చర్చలు జరిపారని సమాచారం..

 

 

ఇక ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎందరో మరణిస్తున్నారు.. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లూ ఈ వాక్సిన్ కనుక త్వరగా వస్తే మరికొన్ని మరణాలు జరగకుండా ఆపవచ్చూ.. ఇప్పుడు ఈ వైరస్‌కు మందు కనిపెట్టినోడే దేవుడని పొగిడే పరిస్దితులు ప్రపంచంలో నెలకొన్నాయి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: