భారతదేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న అన్న విషయం తెలిసిందే.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలను  తీసుకు వచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి  పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు దేశ ప్రజల సహకారం కావాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దేశ ప్రజలు అందరూ జనతా కర్ఫ్యూ  తప్పనిసరిగా పాటించాలి అని ప్రధాని మోదీ తెలిపారు. ఒక రోజంతా కర్ఫ్యూ  పాటిస్తే చాలు... దాదాపుగా కరుణ వైరస్ ను  దేశం నుంచి తరిమి కొట్టినట్లే పిలుపునిచ్చారు. దీంతో దేశం మొత్తం నిశ్శబ్దం గా మారిపోయింది. ఎక్కడ మనుషులు కనిపించడం లేదు. 

 

 

 యుద్ధానికి సిద్ధమై అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యాపారస్తులు ఉద్యోగులు చిరువ్యాపారులు ఇలా అందరూ ఇంటికే పరిమితమై కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ఎన్నో రోజుల నుండి బిజీ బిజీ లైఫ్ వల్ల తమ కుటుంబంతో గడిపే సమయం దొరకలేదు అని బాధ పడుతున్న వారందరికీ ఓ మంచి రోజు రానే వచ్చింది. ప్రస్తుతం అందరూ ఇంటిపట్టునే ఉంటూ కుటుంబంతో సమయం గడుపుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ పైన చేసే యుద్ధం.. కేవలం కరోనా  వైరస్ పారదోలేందుకే  కాదు... కుటుంబంతో కలిసి హాయిగా గడిపేందుకు కూడా దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. అవును! వీకెండ్ అన‌గానే.. టూర్‌కు వెళ్లిపోవ‌డ‌మేనా? ప‌్ర‌కృతిని ఆశ్వాదించ‌డ‌మేనా?  కాదు.

 

 

 ఇప్పుడున్న ప‌రిస్థితిలో మ‌న కుటుంబమే ప్ర‌కృతి. మ‌న కుటుంబంతో హాయిగా క‌లిసి జీవించ‌డ‌మే ప్ర‌కృతి నేర్పుతున్న పాఠం. కుటుంబంతో క‌లిసి హాయిగా ఇంట్లో ఉందాం. కరోనా వైరస్ తరిమి కొడదాం..  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు ఇంటికే పరిమితం కావడం వల్ల... పరిసర ప్రాంతాల్లో ఉండే కరోనా  వైరస్ కేవలం 12 గంటలు మాత్రమే సజీవంగా ఉంటుంది కాబట్టి... 14 గంటలు ఇంటికే పరిమితమైతే ఆ వైరస్ నశిస్తుంది. తద్వారా కరోనా వైరస్ ని పారద్రోలినట్లు  అవుతుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కి  పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: