కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ ను తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంచలన నిర్ణయమే ''జనతా కర్ఫ్యూ''. జనతా కర్ఫ్యూ అంటే ఒకరోజు అంత కూడా ఇంట్లోనే ఉండాలి. అలా ఇంట్లో ఉండటానికి కూడా ఒక కారణం ఉంది. 

 

ఏంటి అంటే.. కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ సమయంలో కరొనాను అంతం చెయ్యడానికి 14 గంటలు అంటే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు ఎవరు కూడా బయటకు రాకూడదు.. ఎందుకంటే 12 గంటలు మాత్రమే వైరస్ బతికి ఉంటుంది కాబట్టి ఈ వైరస్ ను ఆపడానికి 14 గంటలు ఇంట్లో ఉంటే ఆ వైరస్ చచ్చిపోతుంది. అంతేకాదు 14 గంటల తర్వాత భారత్ స్వేఛ్చమైన భారత్ గా మారుతుంది. 

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ కారణంగా.. జనతా కర్ఫ్యూ కారణంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 వరుకు ఇంట్లోనే కుటుంబంతో ఉండే అవకాశం మనకు లభించింది. కాబట్టి మన పిల్లలతో ఇంట్లో ఎంతో ఆనందంగా గడపడానికి ఇది మంచి అవకాశం. అందుకే పిల్లలకు మన సమయం ఇచ్చేద్దాం. 

 

ఫోన్లలో చాటింగ్ చేసుకుంటూ.. జబర్దస్త్ చూసుకుంటూ గడపకుండా ఈ సమయాన్ని పిల్లలకు కేటాయిద్దాం. పిల్లలతో కలిసి ఇంట్లోనే అనేక ఆటలు ఆడుదాం... మన చిప్పడు మనం ఆడిన ఆటలు అన్ని పిల్లలకు నేర్పిద్దాం.. మీకు గుర్తు ఉన్నాయా ఈ ఆటలు.. వైకుంఠ‌పాటి. అష్టాచెమ్మా.. గుడిగుడి గుంచం ఈ ఆటలు గుర్తు ఉన్నాయా? 

 

ఈ ఆటలను వారికీ నేర్పిద్దాం.. వారితో సరదాగా గడుపుదాం.. చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకుందాం.. ఈ జ్ఞాపకాలతో  జీవితాన్ని గడిపేద్దాం.. జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: