తెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటి వరకూ కరోనా విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే పాజిటివ్ గా నమోదైంది. అంటే అది ఇక్కడ అంటుకున్న వైరస్ కాదన్నమాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. మొట్టమొదటి సారి తెలంగాణలో స్థానికులకు ఈ వ్యాధి అంటుకుంది. అంటే కరోనా వ్యాప్తిలో ఇది రెండో దశగా చెబుతారు.

 

 

దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ తరహా కేసులు ఇదే ప్రారంభం. దుబాయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ వృద్ధ వ్యాపారికి మూడు రోజుల క్రితం కరోనా వచ్చిందని నిర్థరించారు. ఆ తర్వాత అనుమానంతో అతని కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజాగా 35 ఏళ్ల ఆయన కుటుంబ సభ్యుడికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది.

 

 

విదేశాల్లో వైరస్ అంటించుకుని వచ్చిన ఆ వ్యాపారి ఈ నెల 14న దుబాయి నుంచి వచ్చారు. కుటుంబ సభ్యులతో నాలుగు రోజులు గడిపారు. ఆ తర్వాత వైరస్‌ లక్షణాలతో 18గాంధీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి కరోనా ఉందని ఈనెల 19న నిర్ధారణ అయింది. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు అతని కొడుకుకూ కరోనా నిర్థరణ అయ్యింది.

 

 

దీంతో మొత్తం మీద తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి పెరిగింది. అదృష్టం ఏంటంటే.. బాధితులు అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇంత వరకూ తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా మరణం నమోదు కాలేదు. ఏదేమైనా కరోనా కట్టడి అనేది ఒక్క ప్రభుత్వాలు మాత్రమే చేస్తే అయ్యే పని కాదు.. ప్రజలంతా ఇలాంటి కష్ట కాలంలో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలం. అందుకే జై జనతా కర్ఫ్యూ అందాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: