మనం బాగుంటే సమాజం బాగుంటుది.. సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది.. ఊర్లు బాగుంటే దేశం బాగుంటుంది.. ఇది జగమెరిగిన సత్యం.  కానీ ఇప్పుడు దేశం ఓ ఉపద్రవం ఎదుర్కొంటుంది.. అదే కరోనా వైరస్.  చైనా నుంచి ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తున్న ఈ కరోనా భారిన మూడు లక్షల మంది పడ్డట్టు తెలుస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.  చైనా తర్వాత అంత దారుణమైన పరిస్థితి ఇటలీ లో ఉంది. ఇప్పటికే అక్కడ 4500 మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది.  కరోనా మహ్మమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు విశేష స్పందన కనిపిస్తోంది.

 

దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆది వారం ప్రజారవాణాను నిలిపివేయనున్నారు. అందులోభాగంగా నగరంలోని హైదరాబాద్‌ మెట్రోరైలుతో పాటు ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపివేయాలని ఆదేశించారు. జనతాకర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి.  జనతకర్ఫ్యూ నేపథ్యంలో ఎవరూ బయటకురాని పరిస్థితి ఉన్న నేపథ్యం లో నగర ప్రయాణికును గమ్యస్థానాలకు చేర్చే  121 ఎంఎంటీఎస్‌ రైళ్లలో 12 మాత్రమే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం నడిపిస్తున్నారు.  మరోవైపు ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి.

 

ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి.  అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ,  ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీలో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు.  అంతే కాదు  ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు బస్సు సర్వీసులన్నిటినీ ఆపేస్తున్నామని, దూర ప్రాంత సర్వీసులను ఈ రోజు అర్ధరాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: