రామ్ గోపాల్ వర్మ మైండ్ నుంచి ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో  ఎవరూ ఊహించలేరు. ఇక ఎవరిపై ఎప్పుడు కామెంట్ చేసి సంచలనం రేపుతాడో  అస్సలు చెప్పలేం. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు రాంగోపాల్ వర్మ. వర్మ ఏం చేసినా వివాదమే... ఏం మాట్లాడినా వివాదమే... ఏ పోస్ట్ పెట్టినా వివాదమే... ఇలా వర్మ అన్నం తిన్నాడా వివాదం తింటాడా అనే  అనుమానం కూడా వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే వర్మ తీసిన సినిమాల్లో వివాదం కొట్టొచ్చినట్లు కనిపించినట్లు గానే... వర్మ మాట్లాడిన మాటల్లో కూడా వివాదం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇక కొన్ని కొన్ని సార్లు రాంగోపాల్ వర్మ సామాజిక సమస్యలపై స్పందిస్తూ తనదైన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అందుకే వర్మ ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇక వర్మ దేని గురించి అయినా పాజిటివ్ గా మాట్లాడాడు అంటే ఇక అంతే అందరూ ఆశ్చర్య పోతూ ఉంటారు. 

 

 

 ఇక ఎప్పుడూ సెన్సేషనల్ కామెంట్స్ తో తెర మీదికి వచ్చి  రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం పోలీసులు... కరోనా  వైరస్ పై అవగాహన కల్పించేందుకు రాములో రాముల పాటకు డాన్స్ చేస్తూ ఉన్న వీడియోని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ పోలీసులకు కాస్త క్లాస్ పీకాడు అని చెప్పాలి. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ బాధ్యతగా పద్ధతిగా ఉండాల్సిన పోలీసులు... సంపూర్ణేష్ బాబు లా కామెడీ చేయకూడదు అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేశాడు. అయితే ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. 

 

 

 ఇక మరోవైపు రాంగోపాల్ వర్మ రజనీకాంత్ పై  కూడా పలు వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ ను అంతం చేయడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమి చేయడం లేదు ఎందుకు..హా.. జస్ట్ ఆస్కింగ్ అంతే అంటూ కామెంట్ పెట్టాడు రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఆసక్తికర కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే  రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంతకుముందు కూడా కరోనా వైరస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కు  డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదని.... షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో నుంచి ఫ్లాప్ హీరో వరకు.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి బెగ్గర్ వరకు... అందగత్తెల నుంచి మామూలు మహిళల వరకు... అందరిని సమానంగా ధర్మంతో చూస్తుంది అని రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక కరోనా  వైరస్ ఎఫెక్టుతో దేవాలయాలను మూసివేయడం పై కూడా కాస్త వ్యంగ్యాస్త్రాలు  సంధించారు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: