అంత‌ర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న కొల్లాపూర్ మామిడి క‌రోనా ఎఫెక్ట్‌తో తోట‌దాట‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పింద‌ల ద‌శ నుండే తోట‌ల చుట్టూ తిరిగే వ్యాపారులు మొహం చాటేశారు. త‌గ్గిన దిగుబ‌డి రేట్ల‌తో పాటు క‌రోనా వార్త‌ల‌తో మామిడి రైతులు మ‌రింత దిగాలు ప‌డిపోతున్నారు. ప్ర‌పంచాన్ని వ‌ణికుస్తున్న క‌రోనా వైర‌స్ కొల్లాపూర్ మామిడి పైన తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. తెలంగాణ‌లోనే అత్య‌ధిక మామిడి సాగు కొల్లాపూర్ ప్రాంతంలో అవుతుంది. సుమారు 15వేల ఎక‌రాల్లో మామిడి సాగు అవుతుంది. వ్యాపారులంతా కూడా ప్ర‌తి ఏటా ఇక్క‌డ‌కు వ‌చ్చి అగ్రిమెంట్లు చేసుకుని మామిడిపండ్ల‌ను కొనుగోలు చేస్తారు. ఆ త‌ర్వాత వాళ్ళు విదేశాల‌కు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న ప‌రిస్థితి ఇది ప్ర‌తి ఏటా జ‌రిగే త‌తంగ‌మే.

 

అయితే  ఈసారి మాత్రం ఈ క‌రోనా వ‌ల్ల వ్యాపారులు ఎవ్వ‌రూ కూడా ఇటువైపు క‌నీసం తొంగి చూడ‌ని ప‌రిస్థితి నెల‌కొనింది అని రైతులు వాపోతున్నారు. ప్ర‌తిసారి పండేకంటే ఈ సారి పంట కూడా యాభై శాతం త‌గ్గింది. ఈ వ్యాధుల కార‌ణంగా పంట కూడా రానటువంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి అని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక ఈ తెలంగాణ‌లో మామిడి పంట‌లు పెంచ‌డంలో మొద‌టి స్థానం నాగ‌ర్‌కర్నూల్ జిల్లా ఉంది. జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 25 ఎక‌రాల్లో మామిడి తోట‌లున్నాయి. ఇందులో ఒక్క కొల్లాపూర్ జిల్లాల‌లోనే 15వేల ఎకరాల్లో మామిడి సాగు చేప‌ట్టిన‌ట్టు ఉద్యాన‌వ‌నాల గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది.

 

గ‌త రెండేళ్ళ బ‌ట్టి పెద్ద‌గా రేటు ఏమీ లేద‌ని అలాగేకాపు కూడా రావ‌డం లేద‌ని ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు ఈ వైర‌స్ వ‌ల్ల ఈ ఏడాది ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆఖ‌రికి చెట్టుకు పురుగు చేర‌కుండా మందులు చ‌ల్లితే ఆ మందుల డ‌బ్బులు కూడా వ‌చ్చేలా లేవు మా ప‌రిస్థితి అంత దారుణంగా ఉంది. కొల్లాపూర్ పూర్వికుల నుంచే ఇక్క‌డ నేల మామిడి పెంప‌కాల‌కు అనుకూలం. ఇది గుర్తించిన సుర‌భిరాజు పూర్వికులు కొల్లాపూర్ ప్రాంతంలో మామిడితోట పెంప‌కాన్ని ప్రోత్స‌హించారు. అయితే తోత‌పురి, రాణిప‌సంద్‌, దిల్‌ప‌సంద్‌, కాలామిస్త్రీ వివిధ ర‌కాల‌ను వేరే ప్రాంతాల నుంచి ప్ర‌త్యేకంగా తెప్పించారు. ఉన్న ఆస్తులు, ఇళ్ళు అమ్ముకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అక్క‌డి రైతులు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలుపుతున్నారు. ఇక ఇక్క‌డి మామిడిని విదేశాల‌కు పంప‌డంతో పాటు పెద్ద పెద్ద మాల్స్‌కి కూడా పంపించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: