కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడం అంత సులభం కాదు.. కానీ అది అసాధ్యమేమీ కాదని కొందరు నిరూపిస్తున్నారు. ఈ మహమ్మారికి మందు కనిపెట్టిన ఉదంతాలు ప్రపంచంలో అక్కడకక్కడా వెలుగు చూస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణలోనూ ఓ ఘన విజయం నమోదైంది. ఎలాగంటే తెలంగాణలో తొలి కరోనా బాధితుడు హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాడు.

 

 

అది ఎలా సాధ్యమైంది.. ఇప్పుడు ఇది ఆసక్తి కరంగా మారింది. తెలంగాణలోని తొలి కరోనా వైరస్‌ బాధితుడికి క్లోరోక్విన్‌ ఔషధాలు వాడి నయం చేసినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లో మార్చి 3కరోనా ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణలో ప్రవేశించిన వ్యాధికి చికిత్స అందించడాన్ని గాంధీ వైద్యులు సవాలుగా తీసుకున్నారు.

 

 

అసలు ఇప్పటి వరకూ వివిధ దేశాల్లో కరోనా బాధితులకు ఎలా చికిత్స చేస్తున్నారో పరిశీలించారు. ప్రపంచంలో చాలా వరకూ మలేరియా, ఎయిడ్స్‌, ఎబోలా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఔషధాలనే ఇస్తున్నారు. గాంధీ వైద్యులు కూడా అదే ప్రయత్నం చేశారు. కరోనా బాధితుడికి ఆసుపత్రిలో చేరే నాటికే న్యూమోనియా, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉన్నాయి.

 

ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అతనికి ఆక్సిజన్‌ అందిస్తూనే రక్తపోటును నియంత్రిస్తూ ఫ్లూయిడ్స్‌ అందించారు. క్లోరోక్విన్‌తోపాటు హెచ్‌ఐవీ, ఎబోలా రోగులకు ఇచ్చే లువినవీర్‌, రెమిడిసివీర్‌ మందులు ఇచ్చారు. ఇలాంటి కేసుల్లో రోగి ధైర్యంగా ఉండటం అవసరం అందుకే అతనికి సైకాలజిస్టుతో రోజూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. క్రమంగా జ్వరం అదుపులోకి వచ్చింది. న్యూమోనియా కూడా తగ్గింది. మొత్తానికి 8వ రోజు మరోసారి పరీక్షలు చేయడంతో కరోనా వైరస్‌ లేనట్లు తేలింది. రెండు రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లోనూ కరోనా లేదని తేలింది. అలా తెలంగాణ కరోనాపై తొలి విజయం సాధించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: