నిజంగా ఈ పుడమికి ఎంత ఓపికో లేకపోతే.. చచ్చిన శవాలతో పాటుగా, బ్రతికి ఉన్న మనుషులు చేస్తున్న నీచ నికృష్టమైన పనులను, వదులుతున్న వ్యర్ధజలాలను, విషవాయువులను తనలో ఇముడ్చుకుని ఈ జీవాన్ని ఎలాంటి స్వార్ధం లేకుండా కాపాడుతుంది.. ఇక పాపాలు చేసే పాపాత్ములను తల్లివలే భరిస్తుంది.. కానీ ఇదేమి అర్ధం చేసుకోకుండా మనిషి తన స్వార్ధం కోసం పుడమి గర్భాన్ని తన అంతులేని కోరికలతో తూట్లు, తూట్లుగా పొడిచేస్తున్నాడు.. ఇదే కాకుండా మనిషిలో అంతర్లీనంగా ఉన్న ఆశతో కర్ర విడిచి సాము చేస్తున్నాడు..

 

 

ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుందట. అందుకే పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.. ఇందుకు ఉదాహరణ నిన్న అన్నిప్రాంతాల్లో జరిగిన సంఘటనలు.. అదేమంటే దేశం నుంచి కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రజలు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు. కాగా కర్ఫ్యూ పిలుపుకు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా జనతా కర్ఫ్యూ సంగతి ఏమో కానీ.. జనాల బుద్దులు బయటపడ్డాయి..

 

 

భయంతో హడావిడి పడిపోతూ. మార్కెట్లు, మార్ట్‌లు, కిరాణా షాపులు, వైన్ షాపులు, పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టారు. శనివారం సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు ఎక్కడ చూసినా జనాలతో షాపులన్నీ కిక్కిరిసిపోయాయి. ఓవైపు ప్రభుత్వం జనాలను బయటకు రావొద్దని చెబితే.. జనాలు మాత్రం పెడచెవిన పెట్టారు. ఈ పరిస్దితిని చూస్తున్న నెటిజన్లు ఇదేం కక్కుర్తి రా బాబు అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఎక్కడ చూడు గుంపులు గుంపులుగా జనాలు కనిపించారు. ఇక మద్యం ప్రియుల సంగతి చెప్పనకర్కర్లేదు.. వైన్ షాపులు మూసేస్తారని తెలియడంతో అందరూ గుంపులుగా రావడంతో షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో మునిగిపోతున్నట్లు అందరూ షాపులకు పరుగులు పెట్టారు.

 

 

ఇకపోతే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ వల్ల నిన్న ఒక్కరోజు దాదాపుగా అన్ని వ్యాపారాలు అతి భీభత్సంగా సాగాయి.. ఈ జనాలను చూస్తే తెలవారితే చచ్చిపోతారా అనేలా, ప్రపంచయుద్ధం వచ్చి సర్వం నాశనం అవుతుందా అనేలా ప్రవర్తిస్తున్నారు.. ఇలా జనాలంతా గుమ్మిగూడితే వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పినా జనాలు గుమ్మిగూడారు.. ఇదే కదా మన ఇండియన్ ఐకమత్యం అంటే..

 

 

పక్కోడు చచ్చిపోయినా ఫర్వాలేదు.. మన కడుపు నిండితే చాలు అనేలా ఆలోచించడం.. మనకంటే నార్త్ కోరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నయం ఎవడైతే రూల్స్ పాటించడో వాన్ని నిర్ధాక్షిణ్యంగా చంపేయండని ఆదేశాలిచ్చాడు.. మరీ మనదగ్గరైతే ఇంత గలీజ్ నాకొడుకులు ఏందిరా బాబు తెలవారితే చచ్చేలా చేస్తున్నారంటూ నెటిజన్స్ ప్రజల తీరు చూసి కామెంట్స్ పెడుతూ, మండిపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: