మనదేశంలో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాలలో కంటే కరోనా వైరస్ ప్రభావం మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తాజాగా మరో 11 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్‌ బాధితుల సంఖ్య 63కు చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని ఆయన తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని కోరారు.

 

 

అయితే దేశంలో ఈ రోజు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. అయితే కర్ఫ్యూ ఈ ఎక్కడ ఎలా జరుగుతున్న మహారాష్ట్ర, కేరళలో మాత్రం సంపూర్ణంగా జరుగుతోంది. ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 40 శాతం సగం మంది కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నారు. ఇంకా మన దేశంలో మొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైయింది. మహారాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూలో అందరూ కచ్చితంగా పాల్గొనాలని పిలుపిచ్చింది. అందుకు తగ్గట్టే ప్రజలు కూడా జనతా కర్ఫ్యూని వంద శాతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

 

 

అయితే దేశంలో ఇప్పటికే 327 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అందులో మహారాష్ట్రలో 64, కేరళలో 52 కేసులున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అనుమానితులందరికీ స్టాంప్ వేశారు. వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది.

 

 

జనతా కర్ఫ్యూ  కరోనా వైరస్ చాలా వరకూ కంట్రోల్ అవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అప్పటికి పరిస్థితి కంట్రోల్ లో లేకుంటే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్రలో లాక్ డౌన్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు ముంబైలోనే ఉన్నాయి. అందువలన వాటిపైనా ఈ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను మంచి అవకాశంగా మార్చు కోవాలనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: