మనసు బాగోక మందు కొడదామంటే ఇక తంటావే. చీకూ చింతా లేదనుకుంటే అది పెద్ద తంటాయే. మందు కొట్టాలన్నా చాలా చేయాలి. ఎలా పడితే అలా వెళ్ళి గ్లాస్ ముందేసుకుని గుక్క తిప్పుకోకుండా లాగించేందామంటే కుదిరే పని కాదు. అంతా ఒక పధ్ధతిగా ఉండాలి. అంటే చాలానే కధ ఉందన్నమాటేగా.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా వైరస్ ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్  కమిషన‌రేట్ కట్టి దిట్టమైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని  బార్ అండ్ రెస్టారెంట్లలో ఇకపై అన్ని రకాల పరీక్షలు తప్పనిసరి చేసింది. పరీక్షలు పూర్తి చేసుకుంటేనే మందుబాబులకు మందు దొరికేది. అలాగే అన్ని చోట్లా చక్కని   సదుపాయాలు క్లీనింగ్ కోసం కల్పించాలి.

 

అదే విధంగా బార్లలో, రెస్టారెంట్లలో పబ్బులలో ఉన్న  సీట్లకు కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి. ఇక బయట నుంచి లోపలికి వెళ్తూనే కడుక్కునేందుకు శానిటైజర్లు, నీళ్ళు, ఇతర వస్తువులు కల్పించాలని కోరింది. చేతులు శుభ్రం చేసుకునేందుకు సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ సూచించారు.

 

అదే విధంగా బార్లు, పబ్బుల్లో కచ్చితమైన శుభ్రతా  పద్ధతులు పాటించాలని కూడా ఆదేశించారు. బార్లు, రెస్టారెంట్లు మేనేజ్మెంట్లు ప్రతీ టేబిల్ కు మధ్య దూరం ఉండేలా కొత్తగా విధానం తీసుకురావాలని  ఆయన ఆదేశించారు.

 

సురక్షితమైన మంచినీరు కూడా బార్ల వద్ద ఉంచాలని కూడా ఆయన సూచించారు. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు పూర్తి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలని ఆదేశించారు. అదే విధంగా అక్కడ ఆహారపదార్ధాల సరఫరా విషయంలో కూడా ఇదే రకమైన నిబంధనలు పాటించాలని కోరారు.

 


ఇక ధర్మల్ స్కానర్లు కూడా అమర్చి ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేయాలని, కరోనా లక్షణాలు  ఉన్నవారు రాకుండా ఆ విధంగా కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ నిబంధనలను కచ్చితంగా ఆంధ్రాలో ఉన్న 28 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యాజమాన్యాలు పాటించాలని యాదవ్ ఆదేశించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: