కరోనా వైరస్ ఇపుడు పెనుభూతమైన మానవాళి కొంప ముంచే పని పెట్టుకుని దూసుకువస్తోంది. కరోనా భూతం పేరు వినడానికే అంతా జడుసుకుంటున్నారు. దాన్ని తేలిగ్గా తీసుకుంటే ఎంతటి పెను ముప్పో ఇటలీ  విషాద  కధ చెబుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ కరోనా గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అది మనతో పాటు అందరినీ ఒక్క దెబ్బకు చిత్తు చేసేస్తుంది. 

 

కరోనా సాధారణ  ఫ్లూ అని ఎవరైనా అనుకుంటే అది చాలా తప్పుడు అభిప్రాయమేనని సైంటిస్టులు అంటున్నారు. కరోనా మామూలు వైరస్ ల కంటే పది రెట్లు ప్రమాదకరమైనది. దీని జోరు ఎక్కువ. వేగంగా మానవ శరీరంలోకి వ్యాపించడమే కాకుండా ఊపిరితిత్తులను సర్వనాశనం చేస్తుంది. ఆ మీదట అది ఒక్క‌ సెకన్లోనే ఎంతో మందికి వ్యాపించి తన విశ్వరూపం చూపిస్తుంది.

 

కరోనాకు ప్రస్తుతం ప్రపంచంలో మందులు ఏవీ  అందుబాటులో లేవు. ఎవరైనా మందులు ఉన్నాయని అంటే అది అబద్దమే. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి సైంటిస్టులు రాత్రీ పగలు శ్రమిస్తున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. అవి ఫలవంతం అవ్వాలనే అంతా కోరుకోవాలి ఈ ప్రయోగాలు ఫలించినా మందు బయటకు రావడానికి కచ్చితంగా ఏడాదికి పైగా సమయం పడుతుందని అంటున్నారు.

 

అలా కనుక కరోనా మందు కనిపెడితే మానవాళికి అది చాలా తొందరగా దొరికిన ఉపశమనం అనుకోవాలి. అందుకే కరోనా విషయంలో నిర్లక్ష్యం అసలు పనికిరాదు. నీవు బాగుండాలి, నీతో పాటు పది మంది బాగుండాలి అని అనుకోవాల్సిన తరుణం. ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణకు అవసరమైన నిబంధనలు పాటించాలి. 

 

మనకేంటిలే అనుకుంటే అది నిన్ను కాదు మొత్తాన్ని ముంచేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు చేయాల్సింది చేస్తాయి. వారికి తగిన మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే. పని ఉంటేనే బయటకు వెళ్ళడం. అదీ జన సమూహంలో కలవకుండా దూరాన్ని పాటించడం అతి ముఖ్యమని అంటున్నారు.

 

భారత్ ఇపుడు రెండవ దశలో ఉంది. ఆ దశ మూడుగా మారితే ఇక కరోనాను ఆపడం ఎవరి తరం కాదు. అది తెలుసుకుని అంతా అప్రమత్తం కావాలి. కరోనా అంటే భయపడడమో, భయపడకపోవడమే కాదు, జాగ్రత్త పడడం ఇపుడు అతి ముఖ్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: