దేశంలోనే తొలి కరోనా హాస్పిటల్ విశాఖలో ఏర్పాటయింది. వైరస్ తీవ్రత దృష్ట్యా చాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిని కరోనా వైద్యసేవల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు వున్నవారిని ఇక్కడకు తరలిస్తున్నారు. మరోవైపు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో 
విశాఖలోని చాతీ, అంటు వ్యాధుల ఆసుపత్రి.... కరోనా హాస్పిటల్ గా మారిపోయింది. అధికారికంగా పేరు మారనప్పటికీ....వైరస్ నియంత్రణ అయ్యే వరకూ ఇక్కడ కరోనా వైద్యసేవలు మాత్రమే లభించనున్నాయి.

 

ఇటీవల మక్కా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకూ నగరంలో 10 కోవిడ్ అనుమానిత కేసులు వున్నాయి. వీరందరినీ చెస్ట్ ఆసుపత్రి ఐసోలేషన్లో వుంచారు.పాజిటివ్ కేసులో బాధితుడి భార్య, కుమార్తెను చాతీ ఆసుపత్రికి తరలించారు. పదిరోజుల పాటు అతడి కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా వివరాలను సేకరించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ కేసుల తీవ్రత పెరుగు తున్న దృష్ట్యా చాతీ,అంటువ్యాధుల ఆసుపత్రిని పూర్తిస్ధాయిలో కరోనా వైద్యసేవలకు  కేటాయించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 

 

ప్రస్తుతం చాతీ ఆసుపత్రిలో 288...అంటువ్యాధుల ఆసుపత్రిలో 50పడకలు అందుబాటులో వున్నాయి. ఇక్కడ 120మంది రోగుల వుండగా  కోవిడ్ విస్తృతి నేపథ్యంలో వీరందరినీ బయటకు తరలించారు. తీవ్రమైన సమస్యలు లేని వారికి మందులు ఇచ్చి ఇళ్ళకు పంపించేశారు. అత్యవసర వైద్యసేవలు పొందవలసిన వారిని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. కేజీహెచ్లో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశారు. చాతీ,అంటు వ్యాధుల ఆసుపత్రిలో రోగులను ఖాళీ చేయించగా 323బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, మానసిక వైద్యశాల ఫ్యామిలీ వార్డు నుంచి 60బెడ్స్ సిద్ధం చేశారు. కోవిడ్ అనుమానిత కేసుల కోసం అదనపు వైద్య సిబ్బంది, అవసరమైన వైద్యపరికరాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. 

 

కోవిడ్ నియంత్రణపై జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. నగరంలో ఐదువేల పడకల సమీకరణకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని విశాఖకు తరలించాలని కేంద్రం ఆదేశించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన నేపథ్యంలో ప్రత్యేక విమానాలు నగరానికి చేరుకుంటున్నాయి. మలేషియా నుంచి 185మంది...సింగపూర్ నుంచి 125మంది ఇప్పటి వరకూ ఇక్కడికి వచ్చారు. విశాఖకు చేరుకున్న విదేశీ ప్రయాణీకులను స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే క్వారంటైన్ కు తరలించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇందు కోసం విమ్స్ ఆసు పత్రిలో 200పడకలు సిద్ధం చేయగా....ప్రస్తుతం ఆరుగురు ఇక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. కోవిడ్ నియంత్రణపై ప్రజలు ఎలాంటి అపోహలకు,ఆందోళనలకు గురికావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది. పూర్తి స్ధాయి కరోనా వైద్య సేవల కోసం యంత్రాంగం సన్నద్ధమైంది. చాతీ ఆసుపత్రిని మూడు షిఫ్టుల్లో 24/7 నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: