భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాన మోడీ సంచలన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ జనతా కర్ఫ్యూ  పాటించాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ దృఢ  సంకల్పంతో కరోనాపై  పోరాటం చేయాలని.. కరోనా  వైరస్ను దేశం నుంచి తరిమి కొట్టేందుకు మీ జీవితంలో నుంచి ఒక్క రోజు నాకు ఇవ్వండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దేశ ప్రజలందరూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం ద్వారా కరోనా  మహమ్మారిని దాదాపు నాశనం చేసినట్లే అవుతుంది అంటూ తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 

 

 

 

 అయితే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కు ఎంతో మంది సినీ రాజకీయ కీడా  రంగ ప్రముఖులు కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమా  అభిమానులకు కూడా జనతా కర్ఫ్యూ   పాటించాలని సూచించారు. ఇక ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి... జనతా కర్ఫ్యూ   ప్రారంభమైంది. దేశంలోని అన్ని ప్రదేశాలు నిర్మానుష్యం గా మారిపోయాయి. ప్రజలందరూ దాదాపుగా ఇంటికే పరిమితమై పోయారు. ఇక ఎన్నో రోజులనుండి కుటుంబానికి సమయం కేటాయించలేని  వారు ఈ ఒక్కరోజు కుటుంబం కోసం గడుపుతున్నారు. కరోనా  వైరస్ను పారదోలేందుకు అందరూ నడుం బిగించారు. 

 

 

 అయితే ఈ జనతా కర్ఫ్యూను ఏకంగా తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కలిపి పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. జనతా కర్ఫ్యూ అంటే పబ్లిక్ హాలిడే కాదని... ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలి అంటూ సల్మాన్ ఖాన్  వ్యాఖ్యానించారు . జనతా కర్ఫ్యూ  సందర్భంగా.. రాజకీయ నాయకులతోపాటు సామాన్యులు సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు అంటూ తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లడం లేదు.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ ప్రాణాంతకమైన వైరస్ నాశనం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించి అందరూ స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ కి  మద్దతు ప్రకటించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: