దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 'జనతా కర్ఫ్యూ' కొనసాగుతోంది.  దేశం మొత్తం బోసిపోయినట్టు ఉంది. రోడ్డుపై ఒకరు ఇద్దరు తప్ప ఎవరూ కనిపించడం లేదు.  కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి ప్రతి ఒక్కరూ చెక్ పెట్టాలని తీసుకున్న జనతా కర్ఫ్యూ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు.ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. రైల్వే స్టేషన్లు ఖాళీగా కనపడుతున్నాయి.

 

 కొవిడ్‌-19పై చేస్తోన్న పోరాటంలో ఈ కర్ఫ్యూ మరింత శక్తిని అందిస్తుంది. మనం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలే రాబోయే రోజుల్లో మనకు సాయం చేస్తాయి. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి.. కరోనాపై పోరాటం' అని మోదీ సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేశారు. ఇక ‘జనతా కర్ఫ్యూ’పాటిస్తున్న ప్రముఖులు తమ ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడుపుతున్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు దొరికిన ఈ సమయాన్ని ఇంట్లో తన మనవడు దేవాన్ష్ తో గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు పోస్ట్ చేశారు. దేవాన్ష్‌కు ఓ పుస్తకం చదివి వినిపిస్తున్నానని తెలిపారు. మన క్షేమం కోసం మనం ఇంట్లోనే ఉండాలన్నారు. మనకు దొరికిన ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పారు.  

 

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో సెల్ఫీ వీడియో తీసుకుని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు.  నమస్తే.. ముఖ్యమంత్రిగారు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుమేరకు కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉన్నాను. స్వచ్ఛందంగా ప్రజలు పాటిస్తోన్న ఈ కర్ఫ్యూ.. మిలటరీ, పోలీసులను పెట్టి జరిపే కర్ఫ్యూ కన్నా బాగా కొనసాగుతోంది. దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు' అని చెప్పారు. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం. మన కుటుంబం, రాష్ట్రం, దేశాన్ని రక్షించుకుందాం అని హరీశ్ రావు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: