ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం చైనా దేశానికి మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెండుతోంది .... ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తోంది. ఇక కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి రోజు రోజుకూ చేయి దాటి పోతుంది. అయితే ఈ కరోనా  వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా వృద్దులు  మృత్యువాత పడుతున్నారు. దీంతో వయసు పెరిగిన వారిని రక్షించుకోవడం ఎలాగొ  అర్థం కాక ప్రపంచ దేశాలు మొత్తం తల్లడిల్లిపోతున్నాయి. ఇక ఇటలీలో అయితే వృద్ధులను తాము రక్షించలేమంటూ  చెప్పేసింది. కరోనా  వైరస్ సోకిన యువకులు మాత్రమే రక్షించగలమని వృద్ధులను మాత్రం రక్షించడం తమ వల్ల కాదు అంటూ చెప్పేసింది. ఇక ఈ పరిస్థితి తెలిసి ప్రపంచ దేశాలు మరింత ఆందోళన చెందుతున్నారు

 

 

 

 ఈ నేపథ్యంలో వృద్ధులను రక్షించడం తమా వళ్ళ కాదు అని ఇటలీ దేశం చేతులెత్తేసిన నేపథ్యంలో... ఇంటికి పెద్దదిక్కు ల ఉన్న వృద్ధులను రక్షించేందుకు  ఇజ్రాయిల్ రక్షణమంత్రి నఫ్తాలి  బెన్నెట్  కీలక సూచనలు చేశారు. కేవలం పెద్దలకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం ఈ సూచనలు అనుసరిస్తే కరోనా  వైరస్ బారిన పడి చనిపోతున్నా వృద్ధులను రక్షించుకోవచ్చు అంటూ ఆయన తెలిపారు. కరోనా వైరస్ బారి నుంచి ఇంటికి పెద్దదిక్కు లాంటి వృద్దులను కాపాడుకోవాలి అంటే.. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం... చేతులు శుభ్రపరచుకోవడం .. మాస్కులు పెట్టుకోవటం... కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవటం  చేయటమే కాదు  ఇలాంటి జాగ్రత్తలు కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే... వృద్ధులను యువకులను వేరువేరుగా ఉంచడం ద్వారా కరోనా  వైరస్ నుంచి తప్పించుకోవచ్చు అంటూ సూచించారు. 

 

 

 ముఖ్యంగా వృద్ధులకు కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా  నేపథ్యంలో కరోనా  వైరస్ సోకిన వారిలో 75 నుంచి 80 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారి మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులను  యువతీయువకులకు దూరంగా ఉంచడం ద్వారా వృద్ధుల  ప్రాణాలను రక్షించిన వారవుతారు. ఇంట్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేమగా కౌగిలించుకోవడం అందరికీ అలవాటైన పని. కానీ అలా చేయకుండా ఉంటేనే మంచిది. వృద్ధులకు దూరంగా ఉండి వీలైనంత వరకు వారికి దగ్గరకు వెళ్ళకుండా మూడు మీటర్ల దూరాన్ని పాటించండి. ఇలా చేయడం ద్వారా వృద్ధులను కాపాడుకోగలుగుతాము  అంటూ ఇజ్రాయిల్ ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు. అయితే ఎప్పటికీ ఇలా ఉండడం  కాదు... కేవలం కారణం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని రోజులు మాత్రమే ఇలా  సూచనలు పాటించాలి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: