కరోనా మహమ్మారి భారత దేశంలో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ బిగ్ సక్సస్ అవడంతో ఈ పద్ధతినే కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్ , పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు 31 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనాని కట్టడి చేయడానికి ఇరు రాష్ట్రాల సీఎం లు కరోనా పొడిగింపు పై కీలక ప్రకటన చేయనున్నారు. మొత్తం తెలుగు రాష్ట్రాలని 31 వరకూ షట్ డౌన్ చేయాడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ త్వరలో మీడియా సమావేశంలో ఈ కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలాఉంటే

IHG

విజయవాడలో తాజాగా కరోనా పాజిటివ్ కేసుని గుర్తించినట్టుగా తెలుస్తోంది. దాంతో జిల్లా కలక్టర్ ఇంతియాజ్ జిల్లా యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైనా చుట్టుపక్కల సుమారు 500 ఇళ్ళలో కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. అంతేకాదు దాదాపు 3 కిలోమీటర్ల మేర ప్రజలని అప్రమత్తం చేశారు. ఈ క్రమమలోనే మరో మూడు రోజులు ఈ కర్ఫ్యూని పొడిగించాలని కలక్టర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని ప్రభుత్వం నుంచీ అనుమతి రాగానే కృష్ణా జిల్లా మొత్తాని లాక్ డౌన్ క్రిందకి తీసుకువస్తారని అంటున్నారు.

IHG

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు వంతుల వారీగా పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం క్షేత్ర స్థాయి అధికారులు మొదలు గెజిటెడ్ ఉద్యోగాలకి కూడా వర్తిస్తుందని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో విధి విధానాలు తెలియాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాల సీఎం లు కాసేపట్లో జరగబోయే ప్రెస్ మీట్ లో 31 వరకూ లాక్ డౌన్ పొడిగింపు చేపట్టాలనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: