కరోనా కలకలం సృష్టిస్తోంది అని అందరికి తెలుసు. ఈ కరోనా బూచి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. ఆరోగ్యాలకి చెక్ పెట్టి ప్రశాంతతని పోగొడుతోంది. ప్రజలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలన్న ధ్యేయంతో  మన ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ గురించి పిలుపునిచ్చారు. అయితే ప్రజల క్షేమం కోసం పిలుపునిచ్చి మంచి మాట చెప్తే అందరూ సీరియస్ అయ్యి దీనిలో పాల్గొన్నారు.

 

 

కానీ ఈ కౌన్సిలర్ మాత్రం  ఎలా ప్రవర్తించాలో మరచిపోయి అనవసర ఆరోపణలు చేసాడు. ఈ విషయం పై మండిపడ్డాడు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రధాని మోదీ సూచనలకు సోషల్ మీడియాలో ఎంతో మంది అవహేళన చెయ్యడం తో సీఎం కేసీఆర్ సైతం ఎంతో మంది మండిపడ్డారు. జనహితం కోసం చేస్తున్న దీనిని తప్పు దారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్త పరిచారు.  

 

 

ఇళ్లకే పరిమితం అవుతూ జనం అంతా నేను సైతం అంటుంటే ఈ  వ్యక్తి మాత్రం గీత దాటాడు. మూర్ఖత్వం  తో ప్రవర్తిస్తూ ఇతరులని కూడా చెడగొట్టే ప్రయత్నం చేసాడు. ఇంకేం ఉంది పోలీసులు తీసికెళ్ళిపోయారు. అటు ప్రధాని పిలుపుకి, సీఎం కేసీఆర్ నిర్ణయానికి అడ్డు చెప్పాడు. ఈ జనతా కర్ఫ్యూకి ముస్స్లింలు మద్దతు ఇవ్వొద్దని కౌన్సిలర్ సమీ చెప్పాడు.

 

అయితే అతను చెప్పిన ఆ వీడియో వైరల్ అయ్యింది.ఇంక పోలీసులు రంగం లోకి దిగక తప్పలేదు. ఇంక ఏముంది అరెస్ట్ చేసారు పోలీసులు. ప్రధాని స్థాయి వ్యక్తిని కించపరిస్తే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. దేశమంతటా కర్ఫ్యూని ఏడు గంటల నుండి తొమ్మిది వరకు చేస్తుంటే, తెలంగాణ మాత్రం 24 కర్ఫ్యూని చేస్తున్నారు. కరోనా పై పోరాటం చేస్తున్న డాక్టర్లకి, పోలీసులకి, మీడియా వారికి, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లతో థాంక్స్ చెప్పాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: