కరోనా అతి ఘోరంగా మనుష్యుల్ని బలి చేస్తోంది . ప్రపంచమంతా విస్తరించి ఈ మహమ్మారి ప్రాణాలని కాజేస్తోంది. ఇదెక్కడ ఘోరంరా  బాబు ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి మందు దొరక్క చావు చూస్తున్న దుస్థితి . కానీ ఏదో కొద్దిగా కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే పాజిటివ్ తేలింది ఒక యువకుడికి . ఆ యువకుడు విజయవాడ చేరాడు . టెస్ట్ చేస్తే దానిలో కరోనా పాజిటివ్ తేలింది.

 

 

తాను ఒక వీడియో చేసాడు .అందులో తాను మాత్రమే కాక ముగ్గురు అదే కారులో ప్రయాణము చేసారు అని చెప్పాడు.    16న ప్యారిస్ నుండి ఢిల్లీ వెళ్ళాడట . అయితే స్క్రీనింగ్ టెస్ట్ లో ఏ పాజిటివ్ లక్షణాలు చూపించక పోయే సరికి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చానని తాను చెప్పాడు . ఆ తర్వాత విజయవాడ వచ్చాడట. అయితే తనని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండమని అధికారులు చెప్పారు.

 

అలానే తన కుటుంబాన్ని ఐసోలేషన్ లో ఉంచారు. అయితే వారికి కూడా చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. మొత్తం దేశం లో కర్ఫ్యూని ఒక్క రోజు చేస్తుంటే బెజవాడ వాస్తవ్యులు మాత్రం ఈ కర్ఫ్యూని మూడు రోజుల పాటు చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. అయితే ఇప్పటికే ఈ యువకుడు కరోనా పాజిటివ్ తో బాధిస్తున్నాడు.

 

 

ఇంకా ఎవరినైనా కలిసాడా అని అడిగితే హైదరాబాద్ నుండి ముగ్గురు ఇతనితో వచ్చారని చెప్పాడు ఈ యువకుడు .ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది.  అయితే ఇతను విజయవాడలో దిగిపోయాడట మిగిలిన వారు గుంటూరు వెళ్లారని చెప్పాడు . అయితే ఆ ముగ్గురు ఎవరు అన్న సంగతి తెలియలేదు. పోలీసులు వెతుకుతున్నారు వారి కోసం . 

మరింత సమాచారం తెలుసుకోండి: