కరోనా పేరుతో చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా ? తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు చైనా ఈ వైర‌స్ బూచీనీ వాడుకుంద‌ని అమెరికా, యూర‌ప్ కేపిట‌ల‌స్టులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీళ్లంతా చైనాలోని ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లో కోట్లాది రూపాయ‌ల‌తో షేర్లు కొన్నారు. ఇప్పుడు వీళ్లంతా వీటిని చాలా త‌క్కువ రేట్ల‌కే ఆ దేశ ప్ర‌భుత్వానికి అమ్ముకున్నారు. దీంతో ఇప్పుడు వీళ్ల‌కు ఈ అనుమానాలు స‌హ‌జంగానే త‌లెత్తుతున్నాయి. త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడుకునేందుకు చైనా ఇలా పెద్ద కుట్ర‌కు తెర‌లేపింద‌ని అంటున్నారు.



త‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో బ‌లంగా పాతుకుపోయిన యూర‌ప్‌, అమెరికా పెట్టుబ‌డిదారుల‌ను  త‌రిమి వేసే క్ర‌మంలోనే చైనా ఈ కొత్త కుట్ర‌కు తెర‌లేపిన‌ట్టు వాళ్లు అనుమానిస్తున్నారు. కరోనా వైరస్ కలకలానికి ముందు చైనాలోని ప్రముఖ రసాయన, సాంకేతిక పరిశ్రమల్లో యూరప్‌, అమెరికా చెందినవారి పెట్టుబడులే అధికంగా ఉండేవి. అయితే లాభాలు కూడా వాళ్లే ఎక్కువుగా ప‌ట్టుకుపోయే వాళ్లు. దీంతో ఈ ఎఫెక్ట్ చైనా క‌రెన్సీ అయిన యాన్‌పై ప‌డి చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ ఎప్పుడూ అత‌లాకుత‌లం అయ్యేది

.

త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఇత‌ర దేశాల వాళ్లు శాసించ‌డం న‌చ్చ‌ని చైనా ఇందుకు క‌రోనాను అస్త్రంగా వాడుకుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా దేశం అంతా కాకుండా కేవ‌లం వుహాన్ వ‌ర‌కే ప‌రిమితం అయ్యేలా ప్లాన్ చేసుకుంద‌ని కూడా సందేహిస్తున్నారు. క‌నీసం మాస్క్‌లు కొనే ప‌రిస్థితి లేద‌న్న వార్త‌లు విజ‌య‌వంతంగా ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస్ అయిన చైనా విదేశీ ముదుపు దారుల వాటాలు కొనుగోలుతో రెండే రెండు రోజుల్లో 20 బిలియన్ డాలర్ల సంపదను సంపాదించింది

.

అస‌లు ఎవ‌రికి ఎంత మాత్రం సందేహాలు లేకుండా చైనా ఈ ప్లాన్ స‌క్సెస్ ఫుల్‌గా అమ‌లు చేసింద‌ని అంటున్నారు. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటి వరకు మొత్తం 81,054 కోవిడ్-19 కేసులు నమోదైతే అందులో 72,440 కేసులు రికవరీ అయ్యాయి. అయితే ఇటలీలో మొత్తం 53,578 కేసులు నమోదు అయితే, అందులో6,072 మంది మాత్రమే రికవరీ అయ్యారు. అక్క‌డ రిక‌వ‌రీని బ‌ట్టి చూస్తే చైనా ఇప్ప‌టికే అక్క‌డ దీనికి యాంటీ మెడిష‌న్ త‌యారు చేసి ఉండ‌వ‌చ్చ‌న్న సందేహాలు కూడా వ్య‌క్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: