కరోనా వైరస్.. ఈ వైరస్ ను అంతం చెయ్యాలి అంటే ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. 

 

ఇప్పటికే ఈ వైరస్ కారణంగా భారత్ లో 7 మంది మృతి చెందారు.. ఈ కరోనా వైరస్ మరణాలను ఆపడానికి.. ఈ వైరస్ భారత్ లో వ్యాపించకుండా ఉండటానికి ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అదే ఈరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు భారత్ ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి అని ''జనతా కర్ఫ్యూ'' అని మోడీ పిలుపునిచ్చారు. 

 

అయితే ఈ వైరస్ ను ఆపేందుకు.. ఈ చైన్ ను అవుట్ బ్రేక్ చేసేందుకు ప్రజలు కూడా ఇళ్ల నుండి బయటకు రాకుండా ఇంట్లనే ఉంది జనతా కర్ఫ్యూ విజయవంత చేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వచ్చింది అని భయపడకుండా మన కోసం ఇల్లు వాకిలి అన్ని వదిలేసి హాస్పిటల్స్ లో ఉండే డాక్టర్లకు.. నర్సులకు.. వాలింటర్లకు.. పోలీసులకు... కరోనా వైరస్ బాధితులకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ.. ఈరోజు సరిగ్గా 5 గంటలకు ఇంటి బాల్కనీ నుండే చెప్పట్లు కొట్టాలి అని మోదీ జనతా కర్ఫ్యూ కి  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రజలందరు కూడా ఇళ్లకే పరిమితమయ్యి జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేశారు.. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయింత్రం 5 గంటలకు దేశంలో 260 కోట్ల చేతులు క‌లిశాయ్‌... చ‌ప్ప‌ట్లు మోగాయ్‌. అందరూ చప్పట్లు కొట్టి కరోనా బాధితులకు సేవ చేస్తున్న వారికీ ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: