తెలుగుదేశం పార్టీకి కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ల ఈ నేపథ్యంలో వాయిదాలు మరియు ఘర్షణలు ఒక ఎత్తయితే ఎలక్షన్లో ఎదుర్కోవటానికి తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి ఏ జిల్లాలో చూసినా టిడిపి నాయకులు చేతులెత్తేస్తున్నారు. ఖర్చులు భయంకరంగా ఉండటంతో తమ వల్ల కాదు అంటూ అధిష్టానానికి ఏమీ ఇవ్వలేనని చెప్పడంతో పాటుగా తమ కింద ఉన్న క్యాడర్ కి కూడా దండం పెట్టేస్తున్నారు. చాలామంది ఇన్చార్జిలు ఈ విధంగానే చేస్తున్నారు. నామినేషన్ల విషయంలో టిడిపి నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారట. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ధైర్యం చేయలేక ముందుకు రాలేక ఎన్నికల నేపథ్యంలో యుద్ధానికి సైడ్ అయిపోయినట్టే అన్నట్టు వ్యవహరించటం ఆ పార్టీలో అందరికీ షాక్ కి గురి చేసింది.

 

ఇదే తరుణంలో ఎన్నికలలో నిలబడిన నాయకులకు ఆర్థికంగా చేయూత ఇవ్వలేమని ముందే చెప్పటంతో తెలుగు తమ్ముళ్ల కష్టాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా చాలాచోట్ల ప్రభుత్వం బిల్లును ఆపడం తో టిడిపి పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, జిల్లా స్థాయి నేతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చు భరించలేమంటున్నారట. ఎన్నికల్లో ఓడి ఏడాది కూడా కాకపోవడంతో మళ్లీ డబ్బులు తియ్యడం అంటే తమ వల్ల కాదని చెబుతున్నట్లు సమాచారం.

 

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల మధ్య స్థానిక ఎన్నికల కోసం డబ్బులు బయటకు తీసిన గెలిచే ఛాన్స్ లేదని, ఒకవేళ గెలిచిన గాని ఆ క్యాండిడేట్ పార్టీలో ఎవరెవరు ఉంటాడో లేదో నమ్మకం కూడా లేదని కామెంటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థి పార్టీ కష్టాలు చూసి జగన్ కూడా తన పార్టీ నాయకులతో అయ్యో అన్నట్టు కామెంట్లు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: