తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో కరోనా వైరస్ ని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆయా ముఖ్యమంత్రులు. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం 14 గంటల నుంచి జనతా కర్ఫ్యూ ని పాటించమని పిలుపునిస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం 24 గంటలపాటు కర్ఫ్యూ పాటించమని పిలుపునిచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా నరేంద్ర మోడీ పిలుపుని గౌరవిస్తూ... మహమ్మారి కరోనా ని అంతమొందించేందుకు నిర్విరామంగా పనిచేస్తున్న వైద్యులను ఇంకా ఇతర అధికారులను అభినందిస్తూ సీఎం కేసీఆర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా చప్పట్లు కొట్టారు. అలాగే జగన్ సర్కార్ మోడీ నిర్ణయాన్ని తెగ కొనియాడుతూ కర్ఫ్యూ ని మరో రెండు రోజులపాటు కొనసాగించే ఆలోచనలు ఉన్నట్టు తెలియజేసింది. 




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరుకోగా అప్రమత్తమైన ముఖ్యమంత్రి జగన్... కర్ఫ్యూ ని మరో రెండు రోజుల పాటు కొనసాగించే సమాలోచన ఉన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇంకా ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన జగన్ కరోనా నివారణ చర్యలపై, కర్ఫ్యూ ని కొనసాగించే ఆలోచనపై చాలాసేపు చర్చించారు.




విదేశాల నుండి ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తులకు కేంద్రం చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ వైద్య పరీక్షలను జరపాలని తెలియజేశారు. కరోనా అనుమానితుల కొరకు ముందస్తుగానే ఐసోలేషన్ వార్డులను చికిత్స సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించారు. అలాగే జనతా కర్ఫ్యూ ని జగన్ పాటిస్తూ ఆదివారం రోజు మొత్తం ఇంటి నుండి బయటకు రాలేదు. అయితే ఈ రోజు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి మరో రెండు రోజులపాటు కర్ఫ్యూ ని కొనసాగిస్తారో లేదో తెలియజేస్తారు. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి ని ఆదిలోనే అంతం చేసే ఆలోచనలో ఉండి ముందుకు సాగుతున్న జగన్ సర్కార్ అందరి ప్రజల ప్రశంసలు పొందుతోంది. ఇన్ని రోజుల పాటు ఇలాంటి చర్యలను చేపడితే కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: