ప్రపంచపు మహమ్మారిగా పిలవబడుతున్న కరోనాతో భారత్ ఫైట్ చేస్తోంది. క్రమంగా దీని వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. ఓ వైపు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన తీసుకు వస్తూనే, మరోవైపు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలను క్లోజ్ చేసారు.. మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దు చేశారు. ఇక కరోనా అనుమానితులను క్వారంటైన్ సెంటర్లులకు తరలిస్తున్నారు. 

 

 

అయితే, కరోనాపై ప్రభుత్వాలు చేపడుతున్న ఈ చర్యల వెనక 123 ఏళ్ల నాటి అంటువ్యాధుల నివారణ చట్టం-1897 ఒకటి ఉందని చెబుతున్నారు. 1896, సెప్టెంబర్‌లో బొంబాయిలో ప్లేగు వ్యాధి ప్రబలిన సంగతి తెలిసినదే. ఆ మహమ్మారిని చూసి జనం హడలెత్తిపోయారు. చూస్తుండగానే పరిస్థితుల చేతిదాడి పోతుండడంతో... ప్రభుత్వం సైతం తీవ్ర దిగ్భాంతికి లోనయ్యింది. ఆ సమయంలో విక్టోరియా మహారాణి రంగంలోకి దిగి, 1897 జనవరి 19న బ్రిటిష్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్లేగు వ్యాధిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

 

 

ఆమె ప్రసంగించిన వారం తర్వాత కలకత్తాలోని "కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా"లో 'జాన్ ఉడ్‌బర్న్' అంటువ్యాధుల నివారణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆమోదం అనంతరం చట్టం అమల్లోకి వచ్చింది. అదియే అంటువ్యాధుల నివారణ చట్టం-1897.. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. ఏదైనా మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాని పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ప్రయోగించి వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టవచ్చన్నమాట..

 

 

ఇక ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఐసోలేషన్ వార్డుల నుంచి, కరోనా అనుమానితులు తప్పించుకున్న సంగతి అందరికి విదితమే. వారిని ఈ చట్టం ఉపయోగించే అదుపులోకి తీసుకున్నారు సదరు అధికారులు. తెలంగాణలో క్వారంటైన్ స్టాంప్ కలిగిన ఓ జంట, క్వారంటైన్లో ఉండకుండా, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించారు. అక్కడి నుంచి తప్పించుకొని రాజధాని రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు యత్నించగా, తోటి ప్రయాణికులు వారిని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సదరు జంటను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: