ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీన పడి ప్రపంచవ్యాప్తంగా 13,000 మంది మృతి చెందారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది. తెలంగాణలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 
 
జనతా కర్ఫ్యూకు దేశవ్యాప్తంగా ప్రజలంతా స్వచ్చందంగా మద్దతు ఇచ్చారు. ప్రజలు 14 గంటల పాటు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల నుండి జనతా కర్ఫ్యూకు అపూర్వ స్పందన వ్యక్తమైంది. భారత్ కరోనా కట్టడి కోసం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడం చూసి ప్రపంచం గర్విస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి 130 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. 
 
దేశంలో చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా మోదీ జనతా కర్ఫ్యూను ఆదర్శంగా తీసుకొని కర్ఫ్యూకు పిలుపునివ్వాలని భావిస్తున్నాయి. కరోనా పని పట్టేందుకు దేశం ఏకమైంది. 
 
కేంద్రం దేశంలో కరోనా కట్టడి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 31 వరకు రైళ్ల రాకపోకలను బంద్ చేయాలని నిర్ణయించుకుని ప్రకటన చేసింది. రైళ్లతో పాటు బస్ లు కూడా బంద్ కాకున్నాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ అయ్యే అవకాశం ఉందని... మరో రెండు రోజుల పాటు ఏపీలో కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: