కరోనా వైరస్.. నిజంగా ఇంత దారుణంగా వ్యాపిస్తుంది అని ఉహించలేదు. కానీ ఈ వైరస్ దారుణంగా అంటే అతి దారుణంగా వ్యాపిస్తుంది. ప్రపంచమంతా తిరిగి అన్ని దేశాలలో వ్యాపించి.. బెదరగొట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు భారత్ కు చేరి చాపకింద నీరులా వ్యాపించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను అంతం చేసేందుకు.. భారత్ నుండి తరిమి కొట్టేందుకు నేడు దేశవ్యాప్తంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా వైరస్ చైన్ బ్రేక్ చెయ్యడానికి 14 గంటలు పాటు ఇంట్లోనే ఉండాలి అని.. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరుకు రోడ్లపైకి ఎవరు రాకుండా జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్షలు పెట్టి ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మర్చి 31 తేదీ వరుకు కర్ఫ్యూ విధించినట్టు చెప్పిన కేసీఆర్.. 

 

ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహించారు.. ఈ సమీక్షలో మంత్రి ఆళ్లనాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్నిలు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

 

అంతేకాదు.. ఇప్పటి వరుకు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అని అయన సూచించారు. అంతేకాదు కరోనా వైరస్ నియంత్రణ కోసం పోరాడుతున్న డాక్టర్లకు.. నర్సులకు.. పోలీసులకు.. మీడియా ప్రతినిధులకు చెప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. మరి సీఎం జగన్ కరోనా వ్యాప్తిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: