దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సూపర్ హిట్ అవగా తెలంగాణాలో మాత్రం బంపర్ హిట్ అయింది. ఎక్కడిక్కడ తెలంగాణా వ్యాప్తంగా ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దేశంలో అతి పెద్ద నగారాల్లో ఒకటి అయిన హైదరాబాద్ లో ఒక్కరు అంటే ఒక్కరు కూడా బయటకు రాలేదు. పోలీసులు, వైద్యులు, మీడియా సిబ్బంది మినహా ప్రజలు ఎవరూ కూడా బయటకు రాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని విజయవంతం చేసారు ప్రజలు అందరూ. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన 24 గంటల జనతా కర్ఫ్యూ ని చక్కగా ఫాలో అయ్యారు ప్రజలు అందరూ కూడా. 

 

ఆర్టీసి బస్సులు గాని క్యాబులు గాని ఏ ఒక్కటి బయట తిరగలేదు. దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియా సమావేశంలో ప్రసంశల వర్షం కురిపించారు. ప్రజలను అభినందించడమే కాకుండా తాను ఒక వీడియో చూసా అని అక్కడ కుక్కలు మాట్లాడుకుంటున్నాయి అని కెసిఆర్ తన మీడియా సమావేశంలో ప్రస్తావించడం గమనార్హం. ఎక్కడా కూడా ప్రజలు బయటకు రాలేదని తెలంగాణా బిడ్డలకు తాను ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. హైదరాబాద్ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిందని అన్నారు. 

 

ఆయన మాటల ఆధారంగా చూస్తే తెలంగాణాలో, ప్రధానంగా నగరాల్లో కర్ఫ్యూ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ప్రజలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడలేదు అనే చెప్పాలి. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనుషులు ఎక్కడ ఉన్నారని కుక్కలు మాట్లాడుకోవడం చూసి తాన్ షాక్ అయ్యా అన్నారు. ఇక తెలంగాణాలో ప్రజలు ఎవరూ కూడా ఈ నెల 31 వరకు బయటకు రావొద్దని అందరికి అత్యవసర, నిత్యావసర సరుకులను అందిస్తామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణాలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని దానికి ప్రజలు సహకరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: