ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో భయానక వాతావరణం ఉందని అన్నారు. 10వ తరగతి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సుభిక్షంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని చెప్పారు. ఏపీని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
అత్యవసర సర్వీసులకు మాత్రమే వాహనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 14 రోజుల పాటు విదేశీయులు బయటకు రాకూడదని చెప్పారు. అత్యవసర ముడి సరుకులకు ఒక్కరే బయటకు వెళ్లాలని అన్నారు. మార్చి 31వ తేదీ వరకు ఏపీని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 2 మీటర్ల దూరం పాటించాలని అన్నారు. ప్రజా రవాణాను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 11,000 మంది థర్మల్ స్క్రీనింగ్ చేశామని అన్నారు. ఉద్యోగులు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అందరూ ఇళ్లలో ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. దేశంలో వాతావరణం బాగాలేదని ఇలాంటి సమయంలో ఒకరికొకరు దూరంగా ఉండాలని చెప్పారు. నిత్యావసర దుకాణాలు తప్ప అన్నీ బంద్ చేస్తున్నామని అన్నారు. 
 
పదేళ్ల లోపు పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని సూచించారు. ఈ సమయంలో ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నామని అన్నారు. పాలు, మెడిసిన్, కూరగాయల కోసం మాత్రమే బయటకు రావాలని చెప్పారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు వెంటనే 104కు కాల్ చేయాలని సూచించారు. ఏపీతో పాటు తెలంగాణ కూడా లాక్ డౌన్ లో ఉంటుందని కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రజలందరూ సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు సూచించారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: