ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు సంబంధించి తొందరలోనే హ్యాపీ న్యూస్ రాబోతోందని సమాచారం. అదానీ గ్రూపు సంస్ధల ఛైర్మన్ గౌతమ్ అదాని తొందరలోనే అమరావతికి రాబోతున్నట్లు సమాచారం.  రిలయన్స్ సంస్ధల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మొన్న ముఖేష్ అంబానీ అమరావతికి వచ్చి జగన్మోహన్ రెడ్డితో భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్న ముఖేష్ భేటి సందర్భం వేరైతే తొందరలో జరగబోయే అదాని భేటి వేరే విషయమట.

 

ఇంతకీ అదాని ఎందుకు వస్తున్నారంటే విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టే విషయమై  చర్చించేందుకే జగన్ తో భేటి అవబోతున్నట్లు సమాచారం. జగన్ అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టదలచుకున్న అదాని వెనక్కు వెళ్ళిపోయాడంటూ చంద్రబాబునాయుడు, టిడిపి నేతలతో పాటు పచ్చమీడియా ఒకటే యాగీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇందులో నిజం లేకపోయినా అబద్ధాన్నే నిజం చేయాలని పచ్చబ్యాచ్ తెగ ప్రయత్నిస్తోంది.

 

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే అదాని సంస్ధలతో చర్చలు జరిపినట్లు సమాచారం. నూతన పారిశ్రామిక విధానాన్ని వాళ్ళకు వివరించి పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ రిక్వెస్ట్ కు అదాని సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. తమ హయాంలో 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టటానికి రెడీ అయిన అదాని జగన్ దెబ్బకు పారిపోయాడని ఎన్ని వందల సార్లు ఆరోపించారో అందరికీ తెలిసిందే.

 

వాస్తవం ఆలోచిస్తే ఏ ముఖ్యమంత్రయినా రూ 70 వేల కోట్ల పెట్టుబడులను వదులుకుంటాడా ? చంద్రబాబు అదాని గ్రూపుకు ఇచ్చిందే లిటిగేషన్లో ఉన్న భూమి. పైగా జగన్ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తమ గ్రూపు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టనున్నట్లు యాజమాన్యం చెప్పిందట. దాంతో ఇచ్చే భూమికన్నా వచ్చే పెట్టుబడులు తక్కువైనపుడు ఏ ప్రభుత్వం కూడా ఆసక్తి చూపదు. జగన్ ప్రభుత్వం చేసింది కూడా అదే.  కాకపోతే మారిన పరిస్ధితుల్లో భారీ పెట్టుబడులకు ప్రభుత్వ రిక్వెస్ట్ చేయటం అదాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరి తొందరలో జరగబోయే భేటిని పాపం  చంద్రబాబు ఎలా తట్టుకుంటాడో ఏమో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: