ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా బాటలోనే నడిచింది. ఏపీలో కూడా ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఈ ప్రకటన చేసారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాలంటీర్స్ ,ఆశ వర్కర్లుకి ,గ్రామసచివాలయం వాళ్ళకి  తన అభినందనలు తెలియజేసారు. జనతాకర్ఫ్యూ  సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా నివారణకు అధికారులు బాగా కృషి చేస్తున్నారని జగన్ ఈ సందర్భంగా అభినందించారు. 

 

అత్యవసర సరుకులకు మినహా ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని జగన్ సూచించారు. ప్రజలు ఎవరూ కూడా పది మంది కంటే గుమిగూడవద్దు అని జగన్ కోరారు. అత్యవసర సరుకులకు కూడా ఒకరు మినహా ఎవరూ బయటకు రావొద్దని ఆయన సూచించారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ చాలా సురక్షితంగా ఉందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని కాబట్టి ప్రజలు అందరూ సహకరించాలని జగన్ కోరారు. 

 

అన్ని సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ప్రభుత్వం మూసి వేసింది అన్నారు. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతుందని ఇది అందరూ పోరాడాల్సిన సమయం అని జగన్ అన్నారు. విదేశాల మంది నుంచి 11670  వచ్చారని, ప్రతి జిల్లా కేంద్రంలో 200  ఐసోలేటెడ్ పడకలు ఏర్పాటని చేసామని చెప్పారు. విదేశాలు వచ్చిన వారు వెంట తిరిగిన వారు కూడా పరిక్షలు చేయించుకోవాలని జగన్ కోరారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు షిఫ్టుల వారీగా పని చెయ్యాలని జగన్ ఈ సందర్భంగా సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: