రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడదామని చూసిన చంద్రబాబునాయుడు వ్యూహానికి నరేంద్రమోడి షాక్ ఇచ్చినట్లే అయ్యింది. స్ధానికసంస్ధల అభివృద్ధికి కేంద్రం నుండి రూ. 1301 కోట్ల బకాయిలను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ నిధులు 2018లోనే రావాల్సుంది. కానీ చంద్రబాబు చేతకానితనం వల్లే నిధులు ఆగాపోయాయి.  స్దానిక సంస్ధల ఎన్నికలను సకాలంలో నిర్వహించని రాష్ట్రాలకు కేంద్రం నిధులను నిలిపేస్తోంది.

 

ఈ నెలాఖరులోగా ఎన్నికలను జరిపించేందుకు జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టింది ఈ నిధుల కోసమే.  ఎన్నికలు జరపకపోతే సుమారు రూ. 5800 కోట్లు నిలిచిపోతుందన్నదే జగన్మోహన్ రెడ్డి బాధ. అయితే నిధులు రానీయకుండా నిలిపేసేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేశాడు. ముందు బిసిల రిజర్వేషన్లన్నాడు. తర్వాత కరోనా వైరస్ ను బూచిగా చూపించాడు. అయితే జగన్ దేన్ని లెక్క చేయకుండా ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టేశాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద కోపంతో రాష్ట్రం నష్టపోయినా పర్వాలేదు అనే శాడిస్టిక్ నేచర్ చంద్రబాబు, యనమల రామకృష్ణుడు లో డెవలప్ అయిపోవటం. ఇక్కడే కేంద్రం వీళ్ళందరికీ షాక్ ఇచ్చింది. 2018-19 ఆర్ధిక సంవత్సరం రెండో విడతలో అందాల్సిన రూ. 870 కోట్లు, 2019-20 మొదటి విడతలో వాయిదా పడ్డ బకాయిలు రూ. 431 కోట్లను అంటే 1301 కోట్ల రూపాయలు ఒకేసారి కేంద్రం విడుదల చేసింది.  ఎప్పుడో నిలిపేపిన నిధులను కేంద్రం ఇపుడు విడుదల చేస్తుందని చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదు.

 

ఒకేసారి కేంద్రం 1300 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తుందని చంద్రబాబు అండ్ కో ఊహించుండరు. ఎలాగూ ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది కాబట్టి కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలు  వాయిదా పడింది కాబట్టి మిగిలిన నిధులను కూడా కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు జగన్ కేంద్రంతో చర్చలు జరిపి లాబీయింగ్ చేస్తే కేంద్రం కూడా కాదనేందుకు లేదు కాబట్టి మిగిలిన వేల కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంది. అప్పుడు చంద్రబాబు మరింతగా గింజుకుపోతాడేమో చూడాలి.

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: