కరోనా వైరస్ తో  భారతదేశం రోజురోజుకు చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రజలు మరింత భయాందోళనలతో బతుకుతున్నారు. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకూ 20కి పైగా కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే తమ తమ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాపించకుండా  ఉండేందుకు ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలు  కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి లాక్ డౌన్  విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... కరోనా  వైరస్ ద్వారా రోజురోజుకు భయానక వాతావరణం నెలకొంటుంది అంటూ తెలిపారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులు కరోనా వైరస్  ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ విదించక  తప్పడం లేదు అంటూ పేర్కొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేవలం అత్యవసర సేవలు మినహా... రాష్ట్రం మొత్తం అన్ని రంగాలు బంద్ అవుతాయి అంటూ ముఖ్యమంత్రి తెలిపారు.

 

 

 ప్రజా రవాణా వ్యవస్థ, బట్టల దుకాణాలు, బంగారం షాపులు షాపింగ్ మాల్స్,  పార్కులు, క్లబ్బులు, పబ్బులు అన్ని మూసివేయాలి   అని ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీలు, వర్క్  షాపులు, గోదాములు ఆఫీసులలో  మొదలైన కార్యాలయాలలో ముఖ్యమైన సిబ్బందితో నడిపించాలని సూచించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ విదిస్తూనే... ఆంధ్ర ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అంతేకాకుండా పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్  మొత్తం మార్చి 31 వరకూ మూసివేయబడుతుంది అని.. రాష్ట్ర ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలి అంటూ  సూచించారు. పదిమందికి మించి  జనాలు ఎక్కడ గుమి గూడ కూడదు అంటూ తెలిపారు. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ రోజులు నిర్వహిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్య అవసరాలు మాత్రం ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: